Begin typing your search above and press return to search.
అభినందన్ బదిలీ.. సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 21 April 2019 8:55 AM GMTఅభినందన్ వర్ధమాన్.. శత్రుదేశపు యుద్ధవిమానాన్ని కూల్చి పాకిస్తాన్ లో పడిపోయినా చెక్కుచెదరి ఆత్మవిశ్వాసంతో ఇండియాకు తిరిగివచ్చిన ధీర ఎయిర్ ఫోర్స్ కమాండర్ వార్త మరోసారి బయటకు వచ్చింది. మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించిన అభినందన్ ను తాజాగా బదిలీ చేశారు.
ఎయిర్ ఫోర్స్ తాజాగా భద్రతా కారణాల రీత్యా శ్రీనగర్ ఎయిర్ బేస్ ఆవల ఉన్న ప్రాంతానికి అధికారులు ఆయన్ను బదిలీ చేశారు. అభినందన్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇక మరోవైపు అభినందన్ విధుల్లో చేరడానికి గల పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.
మే చివరి నాటికి అభినందన్ వైద్యుల పర్యవేక్షణ ముగియనుంది. విమానం కూలిపోతున్న సమయంలో అభినందన్ పాక్ లో దిగి గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం 12వారాలుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పుడు జూన్ నుంచి విధులకు హాజరు కావాల్సి ఉంది.
ఈ క్రమంలోనే బెంగళూరులోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్సేస్ మెడిసన్ నుంచి అభినందన్ కు అనుమతి లభించాల్సి ఉంది. అయితే ఇది వరకు చేసిన శ్రీనగర్ ఎయిర్ బేక్ కాకుండా త్వరలో మరో కొత్త ఎయిర్ బేస్ లో అభినందన్ పోస్టింగ్ ఆర్డర్ జారీ అయినట్టు తెలిసింది. కాశ్మీర్ ఆవలే ఆయన డ్యూటీ ఉండే అవకాశాలున్నాయి.