Begin typing your search above and press return to search.
పవన్ కు అలాంటి వార్నింగ్స్ వస్తున్నాయట!
By: Tupaki Desk | 8 July 2018 6:47 AM GMTగడిచిన కొద్దిరోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీల్ని అమలు చేయలేదన్న అసంతృప్తితో పాటు.. బాబు నాలుగేళ్ల పాలనపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.
తొలుత బాబు పాలనలోని తప్పుల్ని ఎత్తి చూపించటమే పనిగా పెట్టుకున్న పవన్ కల్యాణ్.. ఇటీవల కాలంలో తన టోన్ ను మార్చారు. ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవటం మీద ఆసక్తి లేదన్న ఆయన ఇప్పుడు దేవుడు దయతలిస్తే.. ప్రజలు అవకాశం ఇస్తే తాను సీఎం సీట్లో కూర్చోవటానికి సిద్ధమని ఆయన చెబుతున్నారు.
తన గురువు.. దైవమైన అన్న చిరంజీవిని కాదని మరీ తాను టీడీపీకి గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చినట్లుగా చెప్పిన పవన్.. చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తారని భావించినట్లు చెప్పారు. కానీ.. బాబు సర్కార్ ప్రజల్ని దోచుకుందని.. ఆ పార్టీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చిన తాను ఇప్పుడు అదే పార్టీపై పోటీకి దిగనున్నట్లు చెప్పారు.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థకు ఎకరం రూ.35 లక్షల చొప్పున 40 ఎకరాలు ఇచ్చేశారని..అలా ఇవ్వటానికి ఎవడబ్బ సొమ్ము అంటూ నిలదీశారు. ఇలాంటివి ప్రశ్నిస్తే వెటకారం చేస్తున్నారని.. పిచ్చి వేషాలు వేస్తే చొక్కాలు పట్టుకొని రోడ్ల పైకి ఈడ్చుకొస్తామన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న తనను చంపటానికి ప్లాన్ చేస్తున్నట్లుగా బెదిరిస్తున్నారన్నారు. కారుతో ఢీ కొట్టి చంపేస్తామని.. బాంబులు పెట్టి పేల్చేస్తామని తనకు వార్నింగ్ లు ఇస్తున్నట్లుగా పవన్ చెబుతున్నారు. తమ మధ్య గొడవను రెండు కులాల మధ్య గొడవగా చిత్రీకరించటంపై మండిపడ్డారు.