Begin typing your search above and press return to search.
'ట్రంప్ గెలిస్తే అమెరికా విడిచిపెట్టి పెళ్లిపోతా'!
By: Tupaki Desk | 7 Nov 2016 9:30 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలు దాదాపు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇప్పటికే హిల్లరీకి ఆల్ మోస్ట్ కన్ఫాం అయిపోయిందని సర్వేలూ, మీడియా చెప్పుకొస్తుండగా... చివరి నిమిషంలో అద్భుతాలు జరుగుతాయని ట్రంప్ వర్గం ఆశాభావంగా ఉంది. ఈ క్రమంలో ఎన్నికను చివరి రోజు కూడా ట్రంప్ పై విపరీతమైన కామెంట్స్ పడుతున్నాయి. ఒకరు గెలవాలని, మరొ కరు ఓడిపోవాలని ఎన్నికల్లో కోరుకోవడం సహజం. అయితే ఫలానా వ్యక్తి గెలిస్తే దేశం విడిచి వెళ్లిపోతానని సంచల వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినిమా రంగంలోనూ వేడి పుట్టిస్తున్నాయనే చెప్పాలి. రిపబ్లిన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యకుడిగా ఎన్నికైతే అమెరికా విడిచిపెట్టి పెళ్లిపోతానని నటుడు - మోడల్ - దర్శకుడు ఇయాన్ జోసఫ్ సోమర్ హాల్డర్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు అమెరికాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఇప్పటికే ట్రంప్ ముక్కుపై గుద్దాలని ఉందని ఒక సీనియర్ నటుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇయాన్ జోసఫ్ ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సందర్భంగా మరింతగా ట్రంప్ పై స్పందించిన జోసఫ్... మానవ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఎన్నికలుగా వీటిని అభివర్ణించాడు. అమెరికా అంటే తనకు చాలా ఇష్టం అని, తన పిల్లలు కూడా అమెరికాలోనే పెరగాలని కోరుకుంటున్నానని చెప్పిన ఇయాన్ జోసఫ్... భవిష్యత్ తాను అమెరికాలో ఉంటానో లేదో కచ్చితంగా తెలియదని వ్యాఖ్యానించారు. ఈ రేంజ్ లో ట్రంప్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు జోసఫ్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/