Begin typing your search above and press return to search.

ఐఏఎస్‌ లంతా ఎల్వీ వైపే!... బాబుకు బ్యాండే!

By:  Tupaki Desk   |   6 May 2019 10:58 AM GMT
ఐఏఎస్‌ లంతా ఎల్వీ వైపే!... బాబుకు బ్యాండే!
X
ఏపీలో ప‌రిస్థితులు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. అధికారులు వ‌ర్సెస్ చంద్ర‌బాబు స‌ర్కారుగా సాగుతున్న ఈ ప‌రిణామాలు రోజుకో మ‌లుపు తీసుకుంటున్నాయి. ఈ మ‌లుపులు సినిమాల్లో క‌నిపించే మ‌లుపుల‌కు ఏమాత్రం తీసిపోవ‌డం లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రిగిన ఏపీలో ఈ కోడ్ కాస్తంత గ‌ట్టిగానే అమ‌ల‌వుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ మాట కంటే కూడా టీడీపీ అధినేత‌ - ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న యాగీ కార‌ణంగానే ఈ కోడ్ నానాటికీ క‌ఠినంగా మారుతోంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

ఈ క్ర‌మంలో నిన్న రాత్రి ఏపీ పాల‌న‌లో కీల‌క భూమిక పోషించే ఐఏఎస్ అధికారులంతా ఒక‌చోట ర‌హ‌స్యంగా భేటీ అయ్యార‌ట‌. ఈ భేటీలో కోడ్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో తామంతా సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం వైపునే నిల‌బ‌డాల‌ని తీర్మానించార‌ట‌. అంతేకాకుండా... చంద్ర‌బాబు జ‌రిపే స‌మీక్ష‌ల‌కు హాజ‌రు కారాదని కూడా తేల్చేశార‌ట‌. ఈ ప‌రిణామం నిజంగానే చంద్ర‌బాబుకు అశ‌నిపాత‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదివ‌ర‌కే ఈ దిశ‌గా ఓ ద‌పా ఐఏఎస్‌ లంతా భేటీ కావాల‌ని నిర్ణ‌యించుకున్నా... నాడు కొంద‌రు ఐఏఎస్ లు భేటీకి రాక‌పోవ‌డంతో అది ర‌ద్దైంది. అయితే ఈ ద‌ఫా మాత్రం చంద్ర‌బాబు - ఆయన కేబినెట్ మిత్రులు ఐఏఎస్ అధికారుల‌పై చేస్తున్న కామెంట్లు - ప్ర‌త్యేకించి సీఎస్ గా ఉన్న ఎల్వీ ప‌ట్ల చేస్తున్న ఘాటు వ్యాఖ్య‌లు...ఐఏఎస్‌ లంద‌రినీ ఏకం చేసింద‌న్న వాద‌న వినిపిస్తోంది. భేటీకి దాదాపుగా రాష్ట్రంలో ప‌నిచేస్తున్న ఐఏఎస్‌ లంతా హాజ‌రు కాగా... అంతా కూడా ఎల్వీ వైపే మ‌ద్ద‌తుగా నిల‌బ‌డాల‌ని ఏక‌గ్రీవంగా తీర్మానించార‌ట‌. అంతేకాకుండా భ‌విష్య‌త్తులో చంద్ర‌బాబు నిర్వ‌హించే ఏ ఒక్క స‌మావేశానికి కూడా సీఎస్ అనుమ‌తి లేకుండా హాజ‌రుకారాద‌ని కూడా ఈ సమావేశం తీర్మానించిన‌ట్లుగా స‌మాచారం.

ఈ భేటీ నిజ‌మేన‌ని, ఈ భేటీలో ఐఏఎస్‌ లంతా ఎల్వీవైపే నిల‌బ‌డాల‌ని నిర్ణ‌యించిన వైనం కూడా నిజ‌మేన‌ని కూడా తేలిపోయింది. నేటి ఉద‌యం పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు వెంట సీనియ‌ర్ ఐఏఎస్‌ - జ‌ల‌వ‌న‌రుల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ‌శిభూష‌ణ్ కుమార్ క‌నిపించ‌లేదు. చంద్ర‌బాబు టూర్ స‌మాచారం ఉన్న‌ప్ప‌టికీ శ‌శిభూష‌ణ్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ టూర్ ను అవాయిడ్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఎన్నిక‌ల కోడ్ ఉన్న నేప‌థ్యంలో తాను చంద్ర‌బాబు టూర్ కు రాలేన‌ని కూడా ఆయ‌న తేల్చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే... ఈ నెల 10న కేబినెట్ భేటీని నిర్వ‌హించి తీరతాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ భేటీకి అధికారులు ఎవ్వ‌రూ హాజ‌ర‌య్యే అవ‌కాశమే లేద‌ని చెప్పాలి. మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.