Begin typing your search above and press return to search.

ప్రభుత్వాసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్..

By:  Tupaki Desk   |   2 March 2020 12:33 PM GMT
ప్రభుత్వాసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్..
X
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కావాలి , ప్రభుత్వం నుండి వచ్చే సకల సదుపాయాలు కావాలి. ప్రభుత్వ ఉద్యోగం చేసే అబ్బాయి , అమ్మాయి ..అల్లుడు , కోడలు కూడా కావాలి. కానీ , ప్రభుత్వ స్కూల్స్ కి తమ పిల్లలని పంపరు. అలాగే, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లరు. ఏమంటే ..ప్రభుత్వ స్కూల్ అన్న, ప్రభుత్వాసుపత్రి అన్న చిన్నచూపు. ఈ వ్యవహారం ఈ మధ్య ప్రారంభం అయ్యింది ఏమి కాదు. ఎప్పటినుండో ఇదే వ్యవహారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సమాజంలో కటిక పేదరికం అనుభవిస్తున్నవాడు తప్ప .. ప్రభుత్వాసుపత్రి వైపు చుసేనాధుడే కరువైయ్యాడు.

ఇటువంటి సమయంలో ఒక మహిళా ఐఏఎస్ ప్రజలకి ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెంచడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే తనకు పుట్టబోయే బిడ్డ ప్రైవేట్ ఆసుపత్రిలో కాకుండా ..ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆమె నిర్ణయం మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించింది. ఒక ఐఏఎస్ అధికారి అయ్యి ఉండి , ప్రభుత్వాస్పత్రిలో నవ శిశువుకు జన్మనిచ్చి అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ సంఘటన జార్ఖండ్‌ లో జరిగింది.

జార్ఖండ్‌ రాష్ట్రంలోని గొడ్డ జిల్లాలో కిరణ్‌ కుమార్‌ పాసి అనే మహిళ జిల్లా కమిషనర్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గర్భవతి అయిన ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకి పురిటి నొప్పులు రావడంతో ముందుగా అనుకున్నట్టే .. ప్రభుత్వాసుపత్రికి వెళ్లి అక్కడ తన బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి కిరణ్‌ కుమార్‌, తన బిడ్డతో దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో ఐఏఎస్ అధికారి తీసుకున్న ఈ నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నుంచి అయినా ప్రభుత్వ ఆసుపత్రిలపై ప్రజలకు నమ్మకం పెరిగి వారిలో మార్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు కామెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఐఏఎస్‌ అధికారి డెలవరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి రావడం గర్వంగా ఉందంటూ అక్కడి డాక్టర్‌ చెప్పుకొచ్చారు.