Begin typing your search above and press return to search.
ప్రభుత్వం 'జొమాటో' నడుపుతోందని అనుకుంటున్నారా: వరద బాధితులపై కలెక్టర్ ఆగ్రహం
By: Tupaki Desk | 14 Oct 2022 5:08 PM GMTవరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సాయం చేసేప్పుడు.. ఉన్నతాధికారులు ఎంతో కొంత మానవత్వంతో వ్యవహరించడం.. పరిపాటి. ఇళ్లు మునిగి.. ఉన్న సామాన్లు వరదలకు కొట్టుకుపోయి.. వారు తిండి లేక.. కట్టుకునేందుకు బట్టలు కూడా లేక.. ఇబ్బందులు పడుతుంటారు.
దీంతో ఆయా ప్రాంతాల్లో సేవలు అందించే ప్రభుత్వాలు.. బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరిస్తారు. అయితే.. ఒక కలక్టర్ మాత్రం నోరు పారేసుకున్నాడు. ``మేం ఏర్పాటు చేసిన శిబిరాలకు వస్తే.. ఆహారం ఇస్తాం. మీరు ఇళ్లలో కూర్చుంటే.. ఎలా ఇస్తాం.. మేమేన్నా.. జొమాటో సంస్థనడుపుతున్నామా?`` అని నోరు చేసుకున్నారు. అయితే.. ఇది మన దగ్గర కాదు.. బీజేపీ పాలిత రాష్ట్రంలో కావడం గమనార్హం.
ఉత్తర్ప్రదేశ్ అంబేడ్కర్నగర్ జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చిన కలెక్టర్.. బాధితులకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రభుత్వం జొమాటో సేవలు నడపడం లేదని వ్యాఖ్యానించారు.
వర్షాల కారణంగా నది పొంగిపొర్లడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ జిల్లా వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఘఘరా నదికి వచ్చిన వరదతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం వరద సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ శామ్యూల్ పాల్ సందర్శించారు. సహాయక శిబిరాల ఏర్పాటు గురించి స్థానికులకు వెల్లడించారు. అక్కడ అన్ని సౌకర్యాలున్నాయని చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలు సహాయక శిబిరాలకు రావాలని కోరారు. 'మీరు ఇక్కడ ఉండేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశాం. క్లోరిన్ మాత్రలు ఇస్తాం. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే.. వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇది సహాయక శిబిరాల ఉద్దేశం``అ ని కలెక్టర్ అన్నారు.
ఇంత వరకు బాగానే ఉంది.. తర్వాతే.. నోరు జారేశారు. ``మీరు ఇంట్లో ఉంటే మేం ఆహారం పంపాలా..? ఇక్కడ ప్రభుత్వమేమీ జొమాటో సేవలు నడపడం లేదు' అని కలెక్టర్ దురుసు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన వీడియో తీవ్రస్థాయిలో వైరల్‌గా మారింది. ఈ మాటలను నెటిజన్లు తప్పు పడుతున్నారు. కాస్త సున్నితంగా ఉండాలని సూచిస్తున్నారు. సోమవారం నుంచి కురుస్తోన్న వర్షాలతో యూపీలోని 18 జిల్లాలపై ప్రభావం పడింది. ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంబించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.