Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తిపై బాబు వైఖ‌రి స‌రికాదు..మాజీ ఐఏఎస్!

By:  Tupaki Desk   |   6 Aug 2018 4:38 PM GMT
అమ‌రావ‌తిపై బాబు వైఖ‌రి స‌రికాదు..మాజీ ఐఏఎస్!
X
2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయ‌ వాతావ‌ర‌ణం క్ర‌మ‌క్ర‌మంగా వేడెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో....గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలను ఏపీ సీఎం చంద్ర‌బాబు హఠాత్తుగా గుర్తుకు తెచ్చుకుంటోన్న విష‌యం విదిత‌మే. ఈక్ర‌మంలోనే నిరుద్యోగ భృతి అంటూ....ఎల‌క్ష‌న్ల ముందు మ‌రోసారి ప్ర‌జ‌ల‌ను వంచించేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో నిరుద్యోగ భృతి - రాజ‌ధాని భూములు - అమ‌రావ‌తి నిర్మాణం - రిజ‌ర్వేష‌న్లు....ఏపీకి సంబంధించిన ప‌లు అంశాల‌పై కేంద్రం హోం శాఖ మాజీ - సెక్రట‌రీ మాజీ ఐఏఎస్ అధికారి `ప‌ద్మ భూష‌ణ్` ప‌ద్మ‌నాభ‌య్య అనేక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మించేందుకు 33 వేల ఎక‌రాలు అవ‌స‌రం లేదని....డ‌బ్బులు లేకుండా ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని క‌డ‌తాన‌ని చెబుతోన్న చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌తో తాను విభేదిస్తున్నాన‌ని అన్నారు. ఏపీలోని మిగ‌తా స‌మ‌స్య‌లు తీర్చ‌కుండా....అమ‌రావ‌తిని బెస్ట్ అన‌డం స‌రికాద‌ని - ఇండ‌స్ట్రీలు పెరిగి...మిగ‌తా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని అన్నారు.

సీఎంకు హైద‌రాబాద్ నుంచి విజ‌యవాడ‌కు ప్ర‌త్యేక విమానాలు అన‌వ‌స‌రమ‌ని - రెగ్యుల‌ర్ స‌ర్వీసులున్నాయ‌ని అన్నారు. ఏపీ - తెలంగాణ‌లో యాంటీ డిఫెక్ష‌న్ లా ఉందా అని అనుమానం వ‌స్తోంద‌ని.....పార్టీ ఫిరాయింపులకు పాల్ప‌డ్డ వారిపై స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకోవాలని అన్నారు.

సంత‌లో ప‌శువులు కొన్న‌ట్లు ఎమ్మెల్యేల‌ను కొంటున్నార‌ని....స్వ‌యంగా చంద్ర‌బాబే చెబుతున్నార‌ని....ప్ర‌స్తుత రాజ‌కీయాలు దిగ‌జారాయని....అస‌హ‌నం పెరిగిందని అన్నారు. నిరుద్యోగ భృతి...1000 రూపాయ‌లు ఇచ్చి అండ‌గా ఉండ‌డం త‌ప్పు కాద‌ని, అయితే 2 ఏళ్లు ఇచ్చి.....ఉద్యోగం సంపాదించుకోవాలని నిబంధ‌న పెడితే బాగుంటుంద‌ని అన్నారు. కేవ‌లం ఎల‌క్ష‌న్ల ముందు ఈ భృతి ఇవ్వ‌డం వెనుక ఆంత‌ర్యం ఏమిటో ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. 50 శాతం క‌న్నా ఎక్కువ‌గా రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని - బ్రిటిషు కాలం నుంచి త‌మిళ‌నాడుకు స‌డ‌లింపు ఉందని...అన్ని రాష్ట్రాల‌కు ఆ నిబంధ‌న‌ కుద‌ర‌దని అన్నారు. అయినా...ఆ అంశం సుప్రీం ప‌రిధిలో ఉంద‌ని చెప్పారు. చంద్ర‌బాబు అలా చేయ‌డానికి దాని బ‌దులు....స‌మాజంలో ప్ర‌జ‌ల‌ను లెక్కించి జ‌నాభా ప్ర‌కారం....అంద‌రికీ రిజ‌ర్వేష‌న్లు ఇచ్చి 100 శాతం పూర్తి చేయాల‌ని చ‌మ‌త్క‌రించారు. ప్ర‌జ‌లు ఓటు హ‌క్కు స‌ద్వినియోగం చేసుకోవాలని..... ఎవ‌రు మంచి...చెడు అని ప్ర‌జ‌ల‌కు తెలుసని అన్నారు.