Begin typing your search above and press return to search.

సాక్షిగా స్మితా స‌బ‌ర్వాల్‌.. కేసు ఏమిటంటే?

By:  Tupaki Desk   |   2 Aug 2018 5:08 AM GMT
సాక్షిగా స్మితా స‌బ‌ర్వాల్‌.. కేసు ఏమిటంటే?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఐఏఎస్.. ఐపీఎస్ అధికారులు ఉన్నా.. కొంద‌రికి మాత్ర‌మే స్టార్ ఇమేజ్ ఉంటుంది. అలాంటి స్టార్ ఇమేజ్ ఉన్న ఐఏఎస్ అధికారిణుల‌లో స్మితా స‌బ‌ర్వాల్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. ముక్కుపూటిగా వ్య‌వ‌హ‌రించటం.. నిలువెత్తు నిజాయితీతో పాటు.. ఏన్న‌డూ త‌న ప‌రిధిని దాటకుండా ఉండే ఆమె.. రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు అస్స‌లు త‌లొగ్గ‌ర‌ని చెబుతారు.

తెలంగాణ ఉద్య‌మం సంద‌ర్భంగా ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరుకు ముచ్చ‌ట ప‌డిన కేసీఆర్‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ విజ‌యం సాధించి అధికారం చేప‌ట్టిన వెంట‌నే క‌లెక్ట‌ర్ గా ఉన్న ఆమెను.. త‌న ముఖ్య కార్య‌ద‌ర్శిగా ఎంపిక చేసుకోవ‌టం తెలిసిందే. ముక్కుసూటిగా ఉండే స్మితా స‌బ‌ర్వాల్ ను తీసుకెళ్లి సీఎం పేషీలో కూర్చొబెడితే ఇంకేమైనా ఉందా? అన్న సందేహాల్ని ప‌టాపంచ‌లు చేస్తూ.. త‌న‌పై ఎలాంటి ఆరోప‌ణ రాకుండా.. విమ‌ర్శ‌కు వేలెత్తి చూపించే అవ‌కాశం ఇవ్వ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుంటార‌ని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె క‌రీంన‌గ‌ర్ స్పెష‌ల్ జ్యూడిషియ‌ల్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజ‌ర‌య్యారు. దాదాపు ఐదేళ్ల క్రితం నాటి కేసుకు సంబంధించి సాక్షిగా త‌న వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు ఆమె కోర్టుకు హాజ‌ర‌య్యారు. 2013లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ గా ఆమె వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో.. ఆమె ఎన్నిక‌ల అధికారిగా విధులు నిర్వ‌హించారు.

శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్‌.. ఎమ్మ‌ల్సీ పాతూరి సుధాక‌ర్ రెడ్డి ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ఉల్లంఘించారంటూ క‌రీంన‌గ‌ర్ వ‌న్ టౌన్ పోలీసులు వారిపై వేర్వేరుగా కేసులు న‌మోదు చేశారు. దీంతో.. ఎన్నిక‌ల అధికారిగా వ్య‌వ‌హ‌రించిన ఆమె వారికి నోటీసులు జారీ చేశారు. వారిచ్చిన సంజాయితీతో సంతృప్తి చెంద‌క‌పోవ‌టంతో ఎన్నిక‌ల అధికారిగా కేసులు న‌మోదు చేయాల‌ని అప్ప‌ట్లో ఆమెఓ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు.. అందులో స్మితా స‌బ‌ర్వాల్ ను సాక్షిగా పేర్కొన్నారు. తాజాగా ఈ కేసు కోర్టు విచార‌ణ‌కు రావ‌టంతో సాక్షిగా ఉన్న స్మితా స‌బ‌ర్వాల్ కోర్టు కు హాజ‌రై.. సాక్ష్యం ఇచ్చారు.ఇదే కేసులో నిందితులుగా ఉన్న స్వామిగౌడ్‌.. సుధాక‌ర్ రెడ్డిలు.. కోర్టుకు రాలేదు. వారి త‌ర‌ఫు వారి న్యాయ‌వాదులు కోర్టుకు వ‌చ్చారు.