Begin typing your search above and press return to search.
నిజంగానే: రూ.36 వేలతో ఐఏఎస్ కొడుకు పెళ్లి!
By: Tupaki Desk | 7 Feb 2019 5:26 AM GMTఇవాల్టి రోజున మొదటి పుట్టిన రోజు కార్యక్రమాన్నే హడావుడిగా చేస్తున్న పరిస్థితి. అలాంటిది ఒక ఐఏఎస్ కొడుకు వివాహం అంటే.. హంగామా ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. కానీ.. ఇప్పుడు చెప్పే పెళ్లి లెక్క కాస్త భిన్నం. అందరి మాదిరి హంగూ.. ఆర్భాటాలతో పెళ్లి చేసుకోవటం వారికి ఇష్టం ఉండదు. ఆ మాటకు వస్తే.. వారి పెళ్లికి అయ్యే ఖర్చు లెక్కతెలిస్తే.. మీరు ఓ పట్టాన నమ్మరంటే నమ్మరంతే. ఇంతకీ ఎవరా ఐఏఎస్ అధికారి అన్న విషయానికి వస్తే..
విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి కమిషనర్ పట్నాల బసంత్ కుమార్ తీరు కాస్త వేరు. ఐఏఎస్ అధికారి అయినా వృధా ఖర్చులకు.. ఆడంబరాలకు పోయి లక్షలాది రూపాయిలు ఖర్చు చేయటానికి ఆయన విరుద్ధం. ఆ మధ్యన కుమార్తె పెళ్లిని కేవలం రూ.16,100 ఖర్చుతో పూర్తి చేసిన తీరు ఆయన సొంతం. తాజాగా ఆయన కుమారుడి పెళ్లి విశాఖపట్నంలోని దయాల్ నగర్ లోని సత్సంగ్ ఆధ్వర్యంలో జరగనుంది.
పెళ్లి కుమార్తె తరఫు వారు రూ.16,100.. అదే రీతిలో పెళ్లి కొడుకు వారు అంతే మొత్తాన్ని సమానంగా భరించాలని నిర్ణయించారు. ఈ మొత్తం పెళ్లి జరిపేందుకే కాదు.. విందు భోజనాలకు కలిపి చేయనున్న ఖర్చు. ఇంత సింఫుల్ గా పెళ్లి సాధ్యమేనా? అంటే.. సాధ్యమేనని చెబుతున్నారు బసంత్ కుమార్. రేపు (ఫిబ్రవరి 8) కొత్త జంటను పరిచయం చేసే ఆశీర్వాద కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరు కానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధమ పౌరుడు హాజరు కానున్న సింఫుల్ వేడుక ఇదే అవుతుందేమో!