Begin typing your search above and press return to search.
స్థానిక భాష రాని అధికారులు వద్దు : సీఎం
By: Tupaki Desk | 20 July 2017 5:48 AM GMTనిత్యం ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువయ్యే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నడ భాషలో మాట్లాడలేని అధికారులకు కర్ణాటకలో స్థానం లేదని... అలాంటి వారు తమ ప్రభుత్వానికి వద్దని ఆయన అన్నారు. అంతేకాదు.. అలాంటివారికి కర్ణాటకలో ఉండే హక్కే లేదని కూడా ఆయన అన్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల కోసం ఆయన ప్రాంతీయాభిమానం, భాషాభిమానం రెచ్చగొట్టేందుకు గాను ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీని ఎదుర్కొనేందుకు గాను ఆయన స్పీడు పెంచుతున్నారని.. అందులో భాగంగానే హిందీ వ్యతిరేకత - కన్నడ ప్రేమ ఎక్కువవుతున్నాయని అక్కడి విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకర్ కేఆర్ నందిని సహా 59 మంది కర్ణాటక ర్యాంకర్లను సన్మానించిన సందర్భంలో మాట్లాడిన సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో పనిచేసే ఏ అధికారి అయినా కన్నడ భాష నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అంతేకాదు.... గతంలో ఓ ఐఏఎస్ అధికారి కన్నడ నేర్చుకోబోనని తెగేసి చెప్పడంతో ఆయన్ను మీ సేవలు అవసరం లేదని ఆ అధికారిని కేంద్రానికి తిప్పి పంపించినట్లు గుర్తు చేశారు.
కాగా కర్ణాటకలో స్థానిక భాషపై మక్కువతో హిందీ వ్యతిరేక ఉద్యమం రోజురోజుకూ బలపడుతోంది. హిందీకి వ్యతిరేకంగా కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. హిందీ భాషలో రాసిన ప్రకటనలపై నల్ల రంగు పూశారు. యశ్వంత్‌పూర్ మెట్రో స్టేషన్ కు రాసిన హిందీ అక్షరాలకు కూడా బ్లాక్ కలర్ వేసి కనిపించకుండా చేశారు.