Begin typing your search above and press return to search.

జాతీయ చేనేత దినోత్సవం: గద్వాల చీరలో ఐఏఎస్ స్మితా

By:  Tupaki Desk   |   8 Aug 2021 6:37 AM GMT
జాతీయ చేనేత దినోత్సవం: గద్వాల చీరలో ఐఏఎస్ స్మితా
X
తెలంగాణ కేడర్ కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ చేనేతలకు మద్దతుగా నిలిచారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలను ప్రోత్సహించేందుకు గద్వాల్ చేనేతన్నలు నేసిన చీరను ధరించారు. వారిపై ప్రేమ అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

అద్భుతమైన గద్వాల్ చీరలో అందంగా కనిపిస్తూ స్మిత రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. మరొక చిత్రంలో గద్వాల్ చీరలు ప్రదర్శించబడిన అవుట్ లెట్ ను చూపించారు.

'చీరల సమూహం.. గద్వాల వైభవానికి ప్రతీక.. జోగులాంబ, గద్వాల హస్తకళకు గౌరవం ఇవ్వండి.. నేసనల్ హ్యాండ్ లూమ్ డే రోజున నేత కార్మికులు శుభాకాంక్షలు' అని స్మిత సభర్వాల్ ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా తెలంగాణ చేనేత రంగం ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా గద్వాల చీరలు, కొత్తకోట చీరంలు, పోచంపల్లి చీరలు, నారాయణపేట, గొల్లభామ చీరలు ఫేమస్. గద్వాల చీరలపై మహిళల్లో విపరీతమైన వ్యామోహాన్ని మనం చూడవచ్చు. గద్వాలలో స్వచ్ఛమైన కాటన్ చీరలను బంగారు అంచుతో అందంగా చేతితో నేస్తారు. విభిన్న రంగుల్లో సమాంతర జరీ బోర్డర్ తో రిచ్ లుక్ కనిపించేలా తీర్చిదిద్దుతారు.

ఐఏఎస్ స్మితా సభర్వాల్ మాత్రమే కాదు.. చేనేత ప్రాముఖ్యత ను చాటిన ఎంతో మంది ఔత్సాహికులు కూడా ఉన్నారు.

నటి సమంత 2017లో తెలంగాణ ప్రభుత్వం చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అప్పటి నుంచి చేనేతలకు చురుకైన ప్రమోటర్ గా ఆమె వ్యవహరిస్తోంది.