Begin typing your search above and press return to search.

ఢిల్లీ అల్లర్లలో బయటపడ్డ మరో కొత్త కోణం...డ్రైనేజీలో శవమై తేలిన IB కానిస్టేబుల్‌

By:  Tupaki Desk   |   26 Feb 2020 11:15 AM GMT
ఢిల్లీ అల్లర్లలో బయటపడ్డ మరో కొత్త కోణం...డ్రైనేజీలో శవమై తేలిన IB కానిస్టేబుల్‌
X
గత కొన్నిరోజులుగా సీఏఏకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ లో ఈ ఆందోళనలు మరి ఎక్కువగా ఉన్నాయి. తాజాగా మరోసారి ఢిల్లీ లో ఆందోళనలు కారులు రెచ్చిపోయారు. గత రెండు రెండు రోజులుగా ఢిల్లీ లో చోటు చేసుకుంటున్న దాడులు, ప్రతిదాడుల్లో తాజాగా ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ఇంటెలిజెన్స్ బ్యూరో కానిస్టేబుల్ అంకిత్ శర్మ దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆయన మృతదేహం ఓ డ్రైనేజీలో లభించింది. హింసాకాండతో అట్టుడుకుతున్న ఈ ప్రాంతంలో ఆయన డెడ్ బాడీ కనిపించడం సంచలనమైంది.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలపై దాడులతో అట్టుడుకుతున్న జఫ్రాబాద్, మౌజ్‌ పూర్ సమీపంలోని చాంద్‌ బాగ్ బ్రిడ్జి వద్ద గల డ్రైనేజీలో కొందరు స్థానికులు అంకిత్ శర్మ మృతదేహాన్ని గుర్తించారు. దీనితో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా , పోలీసులు వచ్చి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని , ఆ మృతదేహం అంకిత్ శర్మదిగా ధృవీకరించారు. ఈ విషయాన్ని అంకిత్ తల్లిదండ్రులకి చెప్పగా ..వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అంకిత్ తండ్రి రవీందర్ శర్మ కూడా ఇంటెలిజెన్స్ బ్యూరోలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. శాంతిభద్రతల విభాగంలో పనిచేసిన రవీందర్ శర్మ 2017లో బదిలీపై ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు.

ప్రతి రోజు చాంద్‌ బాగ్ బ్రిడ్జి మీదుగా తరచూ అంకిత్ శర్మ వస్తూ పోతుంటాడు అని, మంగళవారం సాయంత్రం నుంచి తమ కుమారుడి ఆచూకీ తెలియ రాలేదని అంకిత్ తండ్రి తెలిపారు. అయితే , తన కార్యాలయం నుంచి ఇంటికి బయలుదేరిన అంకిత్ శర్మ రాత్రి అయినప్పటికీ ఏంటికి రాలేదని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసినట్లు రవీందర్ శర్మ వెల్లడించారు. రాత్రంతా తాము గాలించినప్పటికీ ఫలితం లేదని, తమ కుమారుడిని ఇలా విగతజీవిగా చూస్తామని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ,ఆప్ మద్దతుదారులే తన కుమారుడిపై దాడి చేసి హతమార్చారని ఆరోపించారు. అంకిత్ పై ఎటాక్ అనంతరం ఆయనపై కాల్పులు కూడా జరిపారని ఆయన అన్నారు.

ఇక ఢిల్లీ లో జరిగే అల్లర్ల పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా చాలా తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీ లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వెంటనే పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దింపాలని ఆమె కోరారు. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని ఆమె ఆరోపించారు.