Begin typing your search above and press return to search.
ఐబీ రిపోర్ట్: జగన్ - కేసీఆర్ కింగ్ మేకర్స్
By: Tupaki Desk | 1 Feb 2019 5:20 AM GMTవచ్చే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో రూపొందించిన నివేదికలు బయటకు వచ్చాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజా రాజకీయాలపై ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించింది. ఈ నివేదికలో వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ‘కింగ్ మేకర్లు’గా తయారవుతారని నివేదికలో ఉన్నట్టు సమాచారం.
గడిచిన రెండు సంవత్సరాలుగా కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెంట్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీల బలాబలాలను అంచనా వేసి ఈ సర్వే రూపొందించారట.. లోక్ సభ ఎన్నికలకు ముందు ఓటర్ల పల్స్ ను అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిసింది.
ఈ ఐబీ సర్వే నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను 20 సీట్లలో గెలుపొందుతుందట.. ఇక టీఆర్ ఎస్ మొత్తం 17 స్థానాల్లో 16 సీట్లు గెలుచుకుంటుందని తేలింది.
అయితే ఈ ఐబీ నివేదిక ప్రకారం.. కేంద్రంలో ఎన్డీఏ కానీ..యూపీఏ కానీ మేజిక్ ఫిగర్ 272 సీట్లను సొంతంగా సాధించలేవని సర్వేలో తేలింది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత వైఎస్ ఆర్ సీపీ లేదా టీఆర్ ఎస్ మద్దతు తోనే కేంద్రంలో యూపీఏ కానీ ఎన్టీఏ కానీ అధికారంలోకి రావచ్చని తేల్చారు.
ఒకవేళ కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి రావాలన్నా వైసీపీ - టీఆర్ ఎస్ కు తోడుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి - తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కలిసి వస్తేనే సాధ్యమని సర్వేలో తేల్చారు. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో వైసీపీ - టీఆర్ ఎస్ మాత్రమే ఇటు కాంగ్రెస్ కు - అటు బీజేపీకి సమదూరం పాటిస్తే తటస్థ వైఖరిని అవలంభిస్తున్నాయి. కేంద్రంలో తమ హామీలకు మద్దతిచ్చే పార్టీలకే మద్దతు ఇవ్వడానికి ఈ రెండు పార్టీలు రెడీ అయ్యాయి.
ఇక మమత బెంగాల్ లో బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో కూడా వైసీపీ అధినేత జగన్ - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనలేదు. ఈ ర్యాలీలో వీరి ఉమ్మడి ప్రత్యర్థి టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొనడంతో వీరిద్దరూ వెళ్లలేదు. చంద్రబాబుతో కలిసి జాతీయ రాజకీయాల్లో కలిసి సాగడానికి జగన్ - కేసీఆర్ సిద్ధంగా లేరు. దీంతో వచ్చే ఎన్నికల్లో వీరిద్దరూ కీలకంగా మారబోతున్నారు. అందుకే వీరిపై బీజేపీ అధిష్టానం - మోడీ గురిపెట్టినట్టు తెలుస్తోంది.