Begin typing your search above and press return to search.

ఐసీసీ కొత్త రూల్స్: ఆటలో ఎలాంటి మార్పులు వస్తాయంటే?

By:  Tupaki Desk   |   20 Sep 2022 1:02 PM GMT
ఐసీసీ కొత్త రూల్స్:  ఆటలో ఎలాంటి మార్పులు వస్తాయంటే?
X
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సులను ఐసీసీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో కీలక మార్పులను చేయనున్నట్టు ఐసీసీ వెల్లడించింది.

సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని కమిటీ చర్చించి కొన్ని విప్లవాత్మక ప్రతిపాదనలు చేసింది. వీటిని మహిళా క్రికెట్ లోనూ అమలు చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

-బ్యాటింగ్ చేస్తున్న బ్యాటర్ క్యాచ్ అవుట్ అయితే వచ్చే బ్యాట్స్ మెన్ యే స్ట్రైక్ తీసుకోవాలి. ఇన్నాళ్లు నాన్ స్ట్రైకర్ బ్యాటర్ క్రీజులోకి వెళితే అతడే స్ట్రైక్ తీసుకునేవాడు. ఇప్పుడు ఔట్ అయితే కొత్త బ్యాటరే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.

-టెస్టుల్లో, వన్డేల్లో పెవిలియన్ నుంచి బ్యాటింగ్ కు వచ్చే బ్యాటర్ 2 నిమిషాల్లో బ్యాటింగ్ కు రెడీ కావాలి. గార్డ్ అని.. ఎక్స్ సైజ్ చేసుకుంటూ ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఇక టీ20 లకు అయితే కేవలం 90 సెకన్లు మాత్రమే బ్యాటింగ్ కు రెడీ కావడానికి పెట్టారు.

-కోవిడ్ వచ్చాక ఉమ్మితో బాల్ ను తుడవడం నిషేధించారు. ఇప్పుడు దీన్ని శాశ్వతంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు.

-బ్యాట్ లేదా.. బ్యాటర్ కొంత భాగం తప్పనిసరిగా పిచ్ లో ఉండాలి. పిచ్ బయటకు పోతే అంపైడ్ డెడ్ బాల్ గా ప్రకటిస్తారు.

-బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు ఫీల్డింగ్ టీం అనైతికంగా ప్రవర్తిస్తే ఆ బాల్ ను డెడ్ బాల్ గా ప్రకటించి 5 పరుగుల ఫెనాల్టీ వేస్తారు.

-నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో క్రీజు దాటిన బ్యాటర్ ను బౌలర్ బౌలింగ్ ఆపేసి ఔట్ చేసే విధానం (మన్ కడింగ్) ఇక అనుమతించారు. దీన్ని కూడా రన్ అవుట్ గా పరిగణిస్తారు.

-బౌలింగ్ వేయకముందే క్రీజులోంచి బ్యాటర్ ముందుకొస్తే బౌలింగ్ ఆపేసి అతడిని బౌలర్ అవుట్ చేయవచ్చు.లేదా కీపర్ కు అందించి ఔట్ చేయింవచ్చు.

-ఇక సమయానికి టైంలోపు బౌలింగ్ పూర్తి చేయకపోతే పెనాల్టీ విధించి ఆటగాళ్లను రౌండ్ సర్కిల్ లోపే ఉంచేలా ఇటీవల టీ20లో ప్రవేశపెట్టారు. దాన్ని కొనసాగించాలని నిర్ణయించారు.

ఇలా అక్టోబర్ 1 నుంచి కొత్త ఐసీసీ నిబంధనలు అమలు కాబోతున్నాయి. వచ్చే టీ20 ప్రపంచకప్ లోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.