Begin typing your search above and press return to search.
ఐసీసీ ర్యాంకింగ్స్.. టీమిండియాకు షాకింగ్స్..!
By: Tupaki Desk | 27 May 2021 5:30 AM GMTఐసీసీ ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో టీమిండియాకు నిరాశే మిగిలిందని చెప్పకతప్పదు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో బ్యాట్స్ మెన్ల జాబితాలో టాప్ 2 ర్యాంక్ కోహ్లీ, టాప్ 3 ర్యాంక్ రోహిత్ శర్మకు దక్కింది. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్రజడేజాకు 9వ స్థానం దక్కింది. ఇక బౌలింగ్ విభాగంలోనే టీమిండియాకు నిరాశే మిగిలింది. ఎప్పుడూ టాప్ లో ఉండే టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సారి ఐదో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. బ్యాటింగ్ లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ టాప్ లో నిలిచాడు.
వన్డే ర్యాంకింగ్స్ లో బౌలింగ్ విభాగంలో టాప్ టెన్ లో టీమిండియాకు చెందిన ఒక్క బౌలర్ కు మాత్రమే అవకాశం దక్కింది.
బుమ్రా ఇంగ్లండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు ఆస్ట్రేలియా టూర్లోనూ అతడు పెద్దగా ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో ఐదో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. న్యూజిల్యాండ్ కు చెందిన ఫేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహిడీ హసన్ మిరాజ్ రెండో ప్లేస్ కు వచ్చాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్దే మ్యాచుల్లో మిరాజ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఈ ఘనత సాధించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌తో రెండో స్థానాన్ని దక్కించుకోవడం.. మిరాజ్ కెరీర్ లో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
అంతకుముందు బంగ్లా తరఫున ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, లెగ్ స్పిన్నర్ అబ్దర్ రజాక్ టాప్2లో చోటుదక్కించుకున్నారు. మరో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ / రెహమన్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని తొమ్మిదో స్థానాన్ని దక్కించుకున్నారు.మరోవైపు త్వరలో టీమిండియా జట్టు ఇంగ్లండ్ టూర్ కు వెళ్లనున్న విషయం తెలిసిందే. టీమిండియా మరో జట్టు శ్రీలంక కు పయనం కానున్నది. శ్రీలంక జట్టుకు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ హెడ్‌కోచ్ గా ఎంపికయ్యారు.