Begin typing your search above and press return to search.
2022కు వాయిదాపడ్డ టీ-20 ప్రపంచ కప్..?
By: Tupaki Desk | 27 May 2020 4:30 PM GMTఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీట్వంటీ ప్రపంచకప్ 2022వ సంవత్సరానికి షెడ్యూల్ చేయనున్నారా..? ఐపీఎల్ నిర్వహణ అక్టోబర్-నవంబర్‌కు మార్చనున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ వైరస్ కారణంగా సెప్టెంబరు వరకూ పర్యాటక వీసాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించింది. దీనితో అక్టోబరులో 16 జట్లు ఆ దేశానికి వెళ్లడం, ఆ తర్వాత క్వారంటైన్, ఖాళీ స్టేడియాల్లో టోర్నీని నిర్వహించడం కష్టమని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చేసింది.
దీనితో టోర్నీని వాయిదా వేయడం మినహా మరో ప్రత్యామ్నాయం ఐసీసీ ముందు లేకపోయింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. దీంతో ఈ సమావేశం తర్వాతనే టీ20 ప్రపంచకప్ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉండటంతో ఈ సమావేశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అయితే ఇప్పటివరకు ఐసీసీ వర్గాలు అందించిన అనధికారిక సమాచారం ప్రకారం అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను 2022కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సమయాన్ని ఐపీఎల్‌కు కేటాయించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచశ్రేణి, మాజీ ఆటగాళ్లు సైతం ప్రస్తుత తరుణంలో ప్రపంచకప్ కంటే ఐపీఎల్ టోర్నీనే ఉత్తమమని సూచిస్తుండటంతో ఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై అధికారిక ప్రకటన గురువారం వెలువడే అవకాశం ఉంది.