Begin typing your search above and press return to search.

సచిన్ తో స్టోక్స్ ఫొటో.. ఐసీసీ ట్వీట్ పై విమర్శలు

By:  Tupaki Desk   |   15 July 2019 11:15 AM GMT
సచిన్ తో స్టోక్స్ ఫొటో.. ఐసీసీ ట్వీట్ పై విమర్శలు
X
ఐసీసీ చేసిన ట్వీట్ ఇప్పుడు భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ప్రపంచకప్ ఫైనల్ కు ముఖ్య అతిథిగా సచిన్ కూడా హాజరయ్యారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ విజేతలకు ట్రోఫీలను అందజేశాడు. అయితే ఇంగ్లండ్ ఫైనల్ లో గెలవడంలో కీలక పాత్ర పోషించిన బెన్ స్టోక్స్ కు సచిన్ ట్రోఫీ అందజేశాడు. ఈ ఫొటోను ట్వీట్ చేసిన ఐసీసీ ‘బెన్ స్టోక్స్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ క్రికెటర్ గా’ పేర్కొంది. అంతవరకూ బాగానే ఉన్నా ఇలా సచిన్ ను పోలుస్తూ స్టోక్స్ ను గ్రేట్ క్రికెటర్ అనడంపై ఇండియన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ప్రపంచకప్ ఫైనల్ లో బెన్ స్టోక్స్ అద్భుతంగా పోరాడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మెగా టోర్నీలోనే 242 పరుగులు చేశాడు. ఫైనల్ లో 84 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ టై జరగడంలో కీలకంగా వ్యవహరించాడు. ఆ తర్వాత సూపర్ ఓవర్ లోనూ 8 పరుగులు చేశాడు. మ్యాచ్ మొత్తంలో స్టోక్స్ వల్లే ఇంగ్లండ్ గెలిచింది.

అయితే సచిన్ తో ఉన్న ఫొటోను షేర్ చేసి ఐసీసీ స్టోక్స్ ను ఆల్ టైమ్ క్రికెటర్ అనడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. సచిన్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని.. బెన్ స్టోక్స్ కు అంత సీన్ లేదంటూ విమర్శిస్తున్నారు. సచిన్ తో ఇంకొకరికి ఫోలిక లేదని.. అతడో లెజండ్ అంటూ పలువురు కామెంట్ చేశారు. సచిన్ ను స్టోక్స్ తో ముడిపెట్టి ఫొటో పెట్టడం తప్పు అని.. సచిన్ ఎప్పటికీ గ్రేట్. ఇది చాలా అవమానకరం అంటూ మరొకరు విమర్శించారు. ఇలా సచిన్ తో పోలిస్తే స్టోక్స్ కు సీన్ లేదంటూ ఐసీసీ ట్విట్టర్ ఖాతాల్లో విమర్శలు ఎక్కువవుతున్నాయి.