Begin typing your search above and press return to search.
వారంలో 7సార్లు భోజనం.. రోజుకు 2సార్లు ఐస్ బాత్
By: Tupaki Desk | 16 Jan 2020 12:00 PM GMTఏ రంగానికి చెందిన ప్రముఖులైనా సరే.. వారికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. స్ఫూర్తి కలిగించే వారి వివరాలు.. వారి అలవాట్లు.. వారి రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? లాంటివి తెలుసుకోవాలనే ఫోకస్ ఉంటుంది. ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ యూట్యూబ్ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. టెక్నాలజీకి సంబంధించి చాలా విషయాలు ఆయన మాట్లాడినా.. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వారు మాత్రం ఆయన పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకే ఎక్కువ ఆసక్తిని చూపించటం గమనార్హం.
తన రోజువారీ జీవితం గురించి వెల్లడించిన జాక్ డోర్సీ.. వారానికి ఏడుసార్లు మాత్రమే తాను భోజనం చేస్తానని చెప్పారు. అది కూడా రాత్రివేళలోనే తాను తింటానని చెప్పారు. గతంలో ఆయన ఐదు సార్లు మాత్రమే భోజనం చేస్తానని చెప్పారని.. ఇప్పుడు మరో రెండుసార్లు పెంచినట్లుగా కొందరునెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. అయితే.. ఆయన మాత్రం ఈ విషయాల్ని పెద్దగా పట్టించుకోవటం లేదు.
వారంలో ప్రతిరోజూ డిన్నర్ మాత్రమే చేస్తానని.. తాను తీసుకునే ఆహారంలో చేపలు.. చికెన్.. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటానని వెల్లడించారు. తానుప్రతి రోజూ ఉత్సాహంగా పని చేస్తానని.. నిద్ర కోసం బెడ్ మీదకు వాలిన పది నిమిషాల వ్యవధిలోనే నిద్ర వస్తుందని చెప్పారు.
ప్రతి రోజూ విటమిన్ సీ తీసుకుంటానని.. విటమిన్ డీ కోసం తాను రోజూ ఆఫీసుకు నడిచి వెళతానని చెప్పారు. అప్పుడప్పుడు ఉపవాసం ఉంటానని చెప్పారు. ఉదయం పదిహేనునిమిషాలు ఐస్ బాత్ చేస్తానని.. రెండు గంటల పాటు ధ్యానం చేస్తానని చెప్పిన ఆయన.. రాత్రి వేళలోనూ మూడునిమిషాల పాటు ఐస్ బాత్ చేస్తానని పేర్కొన్నారు. ఐస్ బాత్ తో మెదడు ఉత్సాహంగా పని చేస్తుందని చెప్పారు. ఆయన చెప్పిన వ్యక్తిగత విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.