Begin typing your search above and press return to search.

ఐసీఎంఆర్ షాకింగ్ రిపోర్ట్ః క‌రోనా మ‌ర‌ణాల‌కు ఇదే కార‌ణం!

By:  Tupaki Desk   |   29 May 2021 2:30 AM GMT
ఐసీఎంఆర్ షాకింగ్ రిపోర్ట్ః  క‌రోనా మ‌ర‌ణాల‌కు ఇదే కార‌ణం!
X
దేశంలో ల‌క్ష‌లాదిగా క‌రోనా కేసులు న‌మోద‌వుతుంటే.. మ‌ర‌ణాలు వేలాదిగా న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. మ‌ర‌ణాలు ఈ స్థాయిలో సంభ‌వించ‌డానికి కార‌ణం ఏంట‌నేది ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) తేల్చింది. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టులో షాకింగ్ అంశాల‌ను వెల్ల‌డించింది. ఆ వివ‌రాలేంటో చూద్దాం.

నిజానికి.. క‌రోనా భ‌యం కార‌ణంగా దాదాపు అంద‌రూ.. కొత్త కేసులు, మ‌ర‌ణాల‌ను లెక్కిస్తున్నారే త‌ప్ప‌, రిక‌వ‌రీ కేసుల గురించి ప‌ట్టించుకోవ‌ట్లేదన్న‌ది వాస్త‌వం. ఇవాళ దేశంలో కొత్త కేసులు 1,86,364 న‌మోద‌య్యాయి. మొత్తం 3,660 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. అదే స‌మ‌యంలో ఈ రోజు 2.59 ల‌క్ష‌ల కేసులు రిక‌వ‌రీ అయ్యాయి. దీన్నిబ‌ట్టి.. క‌రోనా పోరులో ఎంత మంది విజ‌యం సాధిస్తున్నారో గ‌మ‌నించొచ్చు.

అయితే.. చ‌నిపోతున్న వారిలో దాదాపు స‌గం మందికిపై ఒకే కార‌ణంతో చ‌నిపోతున్నార‌ని ఐసీఎంఆర్ తేల్చింది. అదే సెకండ‌రీ ఇన్ఫెక్ష‌న్‌. అంటే.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత చికిత్స పొందుతున్న వారికి మ‌రో ఇన్ఫెక్ష‌న్ రావ‌డంతో.. వారు కోలుకోలేక‌పోతున్నార‌ని తేల్చింది.

అప్ప‌టికే క‌రోనా కోసం ఎన్నో మందులు వాడ‌డం.. స్టెరాయిడ్స్ వినియోగించ‌డం వంటి కార‌ణాల‌తో ఒంట్లో రోగనిరోధ‌క శ‌క్తిపై ప్ర‌భావం చూపుతోంద‌ని ఆ నివేదిక చెబుతోంది. ఇలాంటి స‌మ‌యంలో మ‌రో ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డ‌డంతో.. దానిపై శ‌రీరం పోరాడ‌లేక‌పోతోంద‌ని తెలిపింది. ఈ కార‌ణంగానే.. మ‌ర‌ణాల రేటు పెరుగుతోంద‌ని వెల్ల‌డించింది నివేదిక‌.

అందువ‌ల్ల కొవిడ్ ట్రీట్ మెంట్ సంద‌ర్భంగా యాంటీ బాక్టీరియ‌ల్ మందులు అతిగా ఇవ్వొద్ద‌ని వైద్యుల‌కు సూచిస్తున్నారు నిపుణులు. అదే స‌మ‌యంలో కొవిడ్ బాధితుల‌కు కూడా ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత కూడా కొన్నాళ్ల వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, ఇత‌ర ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డ‌కుండా చూసుకోవాల‌ని చెబుతున్నారు.