Begin typing your search above and press return to search.

అద్భుత టెక్నాలజీ ...24 గంటల్లో ఓ ఊరినే నిర్మించేశారు !

By:  Tupaki Desk   |   7 Jun 2020 12:30 AM GMT
అద్భుత టెక్నాలజీ ...24 గంటల్లో ఓ ఊరినే నిర్మించేశారు !
X
ప్రస్తుత రోజుల్లో ఎంత డబ్బులున్నా కూడా ఓ ఇంటిని నిర్మించాలంటే ఆరు నెలల నుండి ఏడాది సమయం కచ్చితంగా పడుతుంది. అప్పటికి కూడా పూర్తిగా రెడీ అవుతుంది అని చెప్పలేం. కానీ , లాటిన్ అమెరికా కన్‌స్ట్రక్షన్ కంపెనీ ..కేవలం ఇరవై నాలుగు గంటల్లో ఓ గ్రామాన్నే నిర్మించేశారు. లాటిన్ అమెరికాకు చెందిన ఐకాన్ అనే కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీస్ సంస్థ కొత్త తరహా ఇళ్ల నిర్మాణం తో ముందుకొచ్చింది. 3డీ టెక్నాలజీ సహాయంతో 24 గంటల వ్యవధిలో ఏకంగా గ్రామాన్నే నిర్మించి అబ్బురపరిచింది.

కేవలం 50 కుటుంబాలు నివసించే ఆ గ్రామంలో ఒకే ఆకారంలో ఉండే ఇండ్లను నిర్మిస్తున్నారు. కేవలం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఒక భవనాన్ని పూర్తి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. కనీస వసతి లేని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు సరియైన సమయంలో పూర్తి చేయాలన్న సంకల్పంతో త్రీడీ ఇండ్ల నిర్మాణ ఆలోచన పుట్టింది. నీరు, కరంట్, కూలీల వసతి దొరకకపోవడం వల్ల నిర్మాణం ఆలస్యం అవడమే కాకుండా, ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతో నిర్మాణ వ్యయాలు తగ్గించుకునేందుక సంస్థ ప్రతనిధులు ఈ 3డీ హౌజెస్ ఎంతో మేలు అని అంటున్నారు.

ప్రతి ఇంటికి బయటవైపు కిచెన్‌ రూమ్, చుట్టూ కూరగాయలు పండించడానికి స్థలం కూడా ఉంటుంది. ఈ ఆలోచన వల్ల గృహ నిర్మాణ రంగంలో కీలకంగా మార్పులు రానున్నాయి. రెండు వందల డాలర్ల పెట్టుబడి సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు. ఈ త్రీడీ ఇండ్లతో కూడిన గ్రామాలు పర్యాటక ప్రదేశాలుగా మారుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్కదేశాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు వచ్చి త్రీడీ గ్రామాన్ని సందర్శిస్తున్నారు.