Begin typing your search above and press return to search.
శశికళను `చంపేసిన` ఇమ్రాన్ ఖాన్!
By: Tupaki Desk | 20 Dec 2017 4:27 PM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి తనయుడు ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ బాబు `ప్రసంగ`పాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోకేష్ బాబు ప్రసంగించేటపుడు ఏకంగా పార్టీల పేర్లనే మార్చేసి సభను రాసాభాస చేస్తుంటారన్న సంగతి అశేష ఆంధ్ర ప్రజానీకానికి తెలుసు. చిన బాబు గారికి ఈ తరహా పొరపాట్లు....అలవాటుగా మారాయన్నది వేరే విషయం. లోకేష్ బాబు గారి ఖ్యాతి దేశవ్యాప్తంగానే కాదు....దాయాది దేశానికి కూడా వ్యాప్తి చెందినట్లుంది. దాయాది దేశం పాకిస్థాన్ కు చెందిన తెహ్రీక్ ఏ ఇన్ సాఫ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు - మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చినబాబును స్ఫూర్తిగా తీసుకున్నట్లున్నారు. రాజకీయ నాయకులు అక్రమ సంపాదనల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఓ ట్వీట్ చేశారు. అందుకు ఉదాహరణనిస్తూ.....దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పేరుకు బదులు....ఆమె నిచ్చెలి శశికళ పేరును ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు.
తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ నటి - రాజకీయ నాయకురాలు శశికళ చనిపోయిందని - ఆమె ఇంట్లో కొద్ది రోజుల క్రితం భారీగా నగదు - బంగారం - నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. రాజకీయ నాయకులు అవినీతి చేసి అక్రమంగా సంపాదించిన డబ్బును ఏదో ఒక రోజు వదిలి వెళ్లాల్సిందేనని హితవు పలికారు. దాంతో పాటు బంగారం - నగదు ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ ...పొరపాటున జయలలిత బదులు శశికళ అని ట్వీట్ చేశారని ఓ అభిమాని ఇమ్రాన్ కు తెలిపాడు. దీంతో, నాలుక కరుచుకున్న ఇమ్రాన్ వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. ఏదేమైనా - దేశ ప్రధాని కావాలని కలలు కంటున్న ఇమ్రాన్ వంటి నాయకులకు తాము మాట్లాడే మాటలు, అంశాలపై కనీస అవగాహన లేకపోవడం బాధాకరమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.