Begin typing your search above and press return to search.

మరికాస్త ముందే తీసుకుంటే బాగుండేది కదా జగన్!

By:  Tupaki Desk   |   20 April 2021 2:04 AM GMT
మరికాస్త ముందే తీసుకుంటే బాగుండేది కదా జగన్!
X
వినూత్నంగా ఆలోచించటం.. పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తేవటంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుంటారు. మోయలేనంత కొండంత అప్పు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోస్తున్నా.. సంక్షేమ పథకాలకు బ్రేకులు వేయకుండా పాలనా రథాన్ని నడిపించటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి జగన్..తాజాగా వినూత్న నిర్ణయాల్ని ప్రకటించి.. తన మార్కును ప్రదర్శించారు.

కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఏపీలో విపరీతంగా పెరిగాయి. రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటివేళ.. నివారణ చర్యలు ఏమేం తీసుకోవాలనే అంశంపై సమీక్షించిన ఆయన.. ఊహించని రీతిలో నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని.. లేదంటే ఫైన్ విధించాలని కోరారు.

ఏపీలోని కోవిడ్ సమస్యలకు ‘‘104’’ నెంబరును పరిష్కారంగా చూపాలని తేల్చిన జగన్.. మరిన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. సినిమా హాళ్లు.. పంక్షన్ హాళ్లు.. హోటళ్లలో భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. కన్వెన్షన్ సెంటర్లను నిర్వహించే వారు.. భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

కన్వెన్షన్ సెంటర్లలో నిర్వహించే వేడుకల్లో రెండు కుర్చీల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి. సినిమా థియేటర్లలో రెండు సీట్ల మధ్యలో దూరం తప్పనిసరిగా తేల్చారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని.. కోవిడ్ నిర్దారణ అయ్యాక.. వారి ప్రైమరీ కాంట్రాక్టును ట్రేస్ చేయాలని నిర్ణయించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల్ని వింటే మీలోనూ ఉత్సాహం పీక్స్ కు వెళ్లటం ఖాయం. అంతా బాగానే ఉంది కానీ.. ఇలాంటి నిర్ణయాలు ఇంత ఆలస్యంగా తీసుకోవటం ఏమిటి? ఇంతకాలం ఏం చేసినట్లు? అన్న సందేహాన్ని జగన్ ను నేరుగా అడగాలన్న ఆలోచన రావటం ఖాయం.