Begin typing your search above and press return to search.

ఈ అక్కాచెల్లెళ్ల కథ వింటే పిచ్చెక్కిపోతుంది

By:  Tupaki Desk   |   21 March 2016 10:30 PM GMT
ఈ అక్కాచెల్లెళ్ల కథ వింటే పిచ్చెక్కిపోతుంది
X
లోకంలో ఎంతోమంది అక్కాచెల్లెళ్లు ఉన్నా.. వీరిద్దరి బంధం కాస్త భిన్నం. రూపాలు వేర్వేరుగా ఉన్నా.. వారి ఆలోచనలు మాత్రం ఒకేలా ఉండటమే కాదు.. ఆశలు.. ఆకాంక్షలు అచ్చు ఒకేలా ఉండటం.. అన్ని విషయాలు ఇద్దరికి ఒకేలా.. ఒకే సమయంలో జరగాలని అనుకునే తీరు చూస్తే విస్మయం చెందాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన ఈ అక్కాచెల్లెళ్ల లెక్క చూస్తే.. వామ్మో అని అనుకోవాల్సిందే.

ఆస్ట్రేలియాకు చెందిన అన్నా.. లూసీ అనే అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కవలలు. జిరాక్స్ కాపీలా ఉండే వీరిద్దరూ ఒకేలా ఉండేందుకు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా శారీరక కొలతల నుంచి.. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉంటూ.. ఇద్దరూ వేరన్నట్లుగా అనిపించేందుకు అస్సలు ఇష్టపడరు. అలాంటి వీరద్దరూ ఒకే బాయ్ ఫ్రెండ్ ను ఎంపిక చేసుకున్నారు.

కథ ఇక్కడితో ముగిస్తే వార్తల్లోకి ఎందుకు వస్తారు. తాజాగా ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేసారి గర్భవతులు కావాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం తెగ కసరత్తు చేసేస్తున్నారంట. ఒకవేళ తమ ప్లాన్లు ఫెయిల్ అయి.. ఎవరికైనా ముందే గర్భం వస్తే.. మిగిలిన వారు కృత్రిమ పద్ధతిలో గర్భవతి కావటానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరిద్దరి మధ్య బంధం చూసిన వారంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి.