Begin typing your search above and press return to search.
ఆగర్భ శత్రువులు ఆ కవలలు.. తల్లి కడుపులోనే కొట్లాట!
By: Tupaki Desk | 18 April 2019 8:20 AM GMTవినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇప్పటివరకూ అగర్భ శత్రువులు అన్న మాటను వినే ఉంటారు. కొంతమందిని చూపించి ఉండొచ్చు. కానీ.. వారెవరూ.. ఇప్పుడు మేం చెప్పే వారి కాలి గోటికి కూడా సరిపోరు. ఎందుకంటే వారి నేపథ్యంలో అలాంటిది. ఎవరైనా పుట్టిన పదేళ్లకో.. కాదంటే ఐదేళ్లకో ఇద్దరికి పడకపోవటం ఉంటుంది. అందుకు భిన్నంగా.. తల్లి గర్భంలో ఉన్నప్పుడే కొట్టుకునే ఉదంతాల్ని విన్నారా? ఎప్పుడైనా చూశారా? కచ్ఛితంగా చూసి ఉండరు. కానీ.. ఇలాంటి వింత ఘటన ఇప్పుడు వెలుగు చూసింది.
చైనాకు చెందిన ఒక మహిళ నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు స్కానింగ్ చేస్తున్న వేళ.. ఆమె గర్భంలో ఇద్దరు కవలలు కనిపించటం.. వారిద్దరూ తన్నుకొంటున్న వైనాన్ని చూసి థ్రిల్ గా ఫీలయ్యారు. వెంటనే తన మొబైల్ ఫోన్ ద్వారా.. ఆ వీడియో తీశారు. గర్భంలో ఉన్నప్పుడే కొట్టుకుంటున్న వారిని ఆగర్భ శత్రువులు అనక ఏమంటాం? ఇంతకీ.. చైనాలోని ఏ ప్రాంతానికి చెందిన వారు.. ఆ మహిళ తాజా పరిస్థితి ఏమిటి? ఆ పిల్లలు ఏమయ్యారు? వారేం చేస్తున్నారు? పుట్టింది ఆడ? మగ? లాంటి విషయాల్లోకి వెళితే..
చైనాలోని యిన్ చౌన్ ప్రాంతానికి చెందిన ఒక మహిళ నాలుగు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కవలలు కనిపించటం.. వారిద్దరూ కొట్టుకోవటంతో తన పిల్లలు పుట్టకముందే ఇంటర్నెట్ స్టార్ట్స్ అవ్వాలని భావించాడట. అయితే.. ఆ వీడియోను తన వద్దే ఉంచుకొని.. తాజాగా బయటకు విడుదల చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను స్వల్ప వ్యవధిలోనే 20 లక్షల మంది షేర్ చేసుకోగా.. 25 లక్షలకు పైనే చూశారు. ఇక.. కోట్లాడుకున్న ఆ ఇద్దరు కవలలు ఆడ పిల్లలు. వారికి చెర్రీ.. స్టాబెర్రీ అన్న పేర్లను పెట్టారు. వారీ మధ్యనే తల్లిగర్భం నుంచి ప్రపంచంలోకి వచ్చారు.
ఈ వీడియోను చూస్తున్న వారు.. కడుపులో ఉన్నప్పుడే కొట్టుకున్నారు.. బయటకు వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారో? అన్న క్వశ్చన్ లేవనెత్తితే..కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉన్నా.. బయటకు వచ్చిన తర్వాత వీరు తప్పనిసరిగా అన్యోన్యంగా ఉండటం ఖాయమంటున్నారు. ఏమైనా.. తమ చేష్టలతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన ఈ చైనా సిస్టర్స్ ఎప్పుడూ నవ్వుతూ.. సంతోషంగా.. సరదాగా.. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండాలని కోరుకుందాం.