Begin typing your search above and press return to search.
ఇక కళ్లతోనే నేరస్తుల గుర్తింపు : కేంద్రం కొత్త చట్టం
By: Tupaki Desk | 30 March 2022 2:30 AM GMTఒక నేరస్తుడిని పట్టుకోవాలంటే దర్యాప్తులో భాగంగా అన్ని పద్దతులు అవలంభించిన తరువాత వేలిముద్రలను సేకరిస్తారు. మనిషిని పోలిని మనుషుల్లో మిగతా అవయవాలు ఉండొచ్చు గానీ.. వేలి ముద్రలు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. అందువల్ల నేరవిభాగంలో దీనిని ప్రధానంగా భావిస్తారు. అయితే వేలిముద్రల్లోనూ కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి కొందరు నేరాలు చేస్తున్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల్లో నకిలీ వేలిముద్రలు తయారు చేస్తున్నారు. అయితే కేంద్రం తాజాగ ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి ఐరిస్ విధానంతో నేర పరిశోధన చేసేందుకు వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు అమెరికాలో మాత్రమే ఐరిస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భారత్లోనూ దీనిని ఉపయోగించే అవకాశం ఉంది.
అమెరికాలో జంట భవనాల పేళుల్లు సంచలనం సృష్టించాయి. ఈ దాడులతో ప్రపంచం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా అమెరికాలోనూ పోలీస్ వ్యవస్థను మార్చేశారు. అప్పటి నుంచి నేరస్తులను సులువుగా గుర్తించేందుకు ఐరిస్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. అంతకుముందు కేవలం వేలిముద్రలతో మాత్రమే నేరగాళ్లను పట్టుకునేవారు. ఇప్పుడు భారత్ కూడా అదే తరహాలో చేయాలని అనుకుంటోంది. అయితే ఇప్పటి వరకు ఉన్న 1920 నాటి ఖైదీల చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో ‘క్రిమినల్ ప్రొసీజర్’(ఐడెంటిఫికేషన్) బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈమేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెనీ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
పెరుగుతున్న టెక్నాలజీతో నేరస్తులు సైతం సాంకేతికాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో పోలీస్ వ్యవస్థలో మార్పలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దర్యాప్తు చట్టంలో ‘మెజర్ మెంట్’అనే పదానికి విస్తృత అర్థం ఇవ్వనున్నారు. అంటే వేలిముద్రలతో పాటు రెటీనా, ఐరిస్, జీవ నమూనాలను అదనంగా జోడించనున్నారు. దర్యాప్తులోని అధికారులు వీటి ఆధారంగా ఎంక్వైరీ చేయనున్నారు. అలాగే ఒక ఖైదీని ఐరిస్ తీసుకుంటే ఆ ఖైదీ ఎక్కుడున్నా సులువుగా గుర్తించేందుకు వీలుగా ఉంటుంది.
అయితే ఈ బిల్లు పై ఓ వైపు హర్షం వ్యక్తం చేస్తున్నా అమలుపై కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల సమాచారం, వారి డేటా సేకరించే అధికారం ఎవరికీ ఇవ్వనున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. బిల్లు ప్రకారం ఇలాంటి వివరాలు జైలు అధికారులు తీసుకుంటారు. దీంతో హెడ్ కానిస్టేబుల్ కాంటే తక్కువ అధికారం ఉన్న వారికి ఇలాంటి పని అప్పజెప్పనున్నారు. గతంలో ఎస్సై స్థాయి వారికి మాత్రమే నేరస్థుల డేటాను సేకరించే అధికారాన్ని ఇచ్చారు.