Begin typing your search above and press return to search.
పాపం... ఆ ఐఏఎస్ ఎంత బాధపడిందో?
By: Tupaki Desk | 4 Aug 2015 7:35 AM GMTఆమె ఒక ఐఏఎస్ అధికారిణి... ఎన్నో అవరోధాలు జయించి ఉన్నతోద్యోగం సంపాదించారు... మహిళలకు ఆదర్శంగా నిలిచారు... కానీ, ఆమెకు కూడా అందరిలాగే అవమానం.. వేధింపులు తప్పలేదు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు... ఆ ఆవేదన సోషల్ మీడియాలో అక్షరాలుగా మారగా ఇప్పుడవి దేశమంతా సంచలనమయ్యాయి. ''అడుగడుగునా ఇడియట్లే ఉన్నారు. ఈ దేశంలో మహిళలు జన్మించకూడదని ప్రార్థిస్తాను" అని ఓ ఐఏఎస్ అధికారిణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్ బుక్ లో ఆమె చేసిన వ్యాఖ్యలు 48 గంటల్లో సోషల్ మీడియా అంతా పాకేశాయి. ఆమె వ్యాఖ్యలకు మద్దతుగా లక్షలాది లైక్ లు.. వేలాది షేరింగ్ లు.
తనకు అసభ్య సందేశాలు పంపిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిపై మధ్యప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారి రీజు బాఫ్నా గతవారం లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఉద్యోగం కూడా ఊడింది. అయితే... ఆమె అక్కడితో విడిచిపెట్టలేదు... సమాజానికి తన ఆవేదన తెలియపర్చాలనుకున్నారు. అందుకు సోషల్ మీడియాను మార్గంగా ఎంచుకున్నారు. కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందికరమైన పరిస్థితిని కూడా ఆమె తన ఫేస్ బుక్ పోస్ట్ లో వివరించారు. కోర్టుకు తాను వెళ్లినప్పుడు డిఫెన్స్ న్యాయవాది, మరికొందరు అక్కడ ఉన్నారని, వారందరి ఎదుట వాంగ్మూలం ఇవ్వటం ఇబ్బందికరంగా ఉందని, అందువల్ల వారందరినీ బయటకు వెళ్లాలని కోరానని తెలిపారు. ఇందుకు ఆ న్యాయవాది గట్టిగా అరుస్తూ 'మీరు మీ ఆఫీసులో అధికారి కావచ్చు.. కానీ కోర్టులో కాదు' అని అన్నారని పేర్కొన్నారు. తన ఆవేదనను జడ్జికి కూడా మొరపెట్టుకున్నానని తెలిపారు. లైంగిక వేధింపుల కేసులో ఓ మహిళ వాంగ్మూలం ఇస్తున్నప్పుడు ఆ పరిసరాల్లో ఉన్న వ్యక్తుల పట్ల జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరాను. ఇందుకు ఆయన 'మీరు యవ్వనంలో ఉన్నారు కాబట్టి అలాంటి డిమాండ్ చేస్తున్నారు' అన్నారని పోస్ట్ చేశారు. భారతదేశంలో మహిళల ఇబ్బందులను పట్టించుకునేవారే లేరని.... అడుగడుగునా ఇడియట్లే ఉన్నారని, అందువల్ల అసలు స్త్రీలు ఈ దేశంలో పుట్టకూడదని ప్రార్థిస్తానని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరస్ లా వ్యాపిస్తున్నాయి. అయితే... ఒకరిద్దరు చేస్తున్న తప్పులకు అందరినీ తప్పుపట్టడం.. దేశాన్ని ద్వేషించడం కూడా సరికాదన్న వాదన వ్యక్తమవుతుంది.