Begin typing your search above and press return to search.

ఇదేందయ్య ఇదీ.. ఇడ్లీ 'ఏటీఎం'నా? ఎప్పుడూ సూడలే!

By:  Tupaki Desk   |   17 Oct 2022 3:57 AM GMT
ఇదేందయ్య ఇదీ.. ఇడ్లీ ఏటీఎంనా? ఎప్పుడూ సూడలే!
X
సాధారణంగా మనకు డబ్బులు ఇచ్చే ఏటీఎంల గురించి తెలుసు. కానీ ఇక్కడ ఇడ్లీలు ఇచ్చే ఏటీఎంలు వచ్చేశాయి. టెక్నాలజీ సిటీ బెంగళూరు ఈ ఘనత సాధించింది. ఈ అబ్బురాన్ని అందరికీ చవిచూపించింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇడ్లీ ఏటీఎం వైరల్ అవుతోంది.

దక్షిణాదిన అత్యంత ఇష్టమైన అల్పాహారం ఇడ్లీ. ఇది సిద్ధం చేయడం సులభం. ఇతర సాంప్రదాయ అల్పాహార ఎంపికల కంటే తక్కువ సమయం పడుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. బెంగుళూరులో ఒక స్టార్టప్ కేవలం 55 సెకన్లలో ఇడ్లీని తయారు చేయగల ఇడ్లీ వెండింగ్ మెషీన్‌ తయారు చేసి వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇది చాలా త్వరగా తయారు చేస్తూ వినియోగదారుల మనసు దోచుకుంటోంది.

'ఇడ్లీ ATM'కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ వైరల్‌గా కూడా మారింది. ఈ వీడియోపై మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఇడ్లీ రుచి గురించి ప్రజలను అడిగారు. త్వరలో దానిని సందర్శించి, తన ఇడ్లీని తిని చూస్తానని తెలిపారు.

“చాలా మంది రోబోటిక్ ఫుడ్ ప్రిపరేషన్/వెండింగ్ మెషీన్‌లను రూపొందించడానికి ప్రయత్నించారు. ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ( FSSAI) ప్రమాణాలకు అనుగుణంగా ఉందని.. పదార్థాలు తగినంతగా రిఫ్రెష్ చేయబడతాయని తేలింది. మరి దీని రుచి ఎలా ఉంది, బెంగళూరు ప్రజలారా? అంటూ ఆనంద్ మహీంద్రా కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు/మాల్స్‌లో కూడా ఈ ఇడ్లీ ఏటీఎం మిషన్ ను చూడాలని నేను అనుకుంటున్నారు. ఇది హిట్ అయితే ఒక ప్రధాన 'సాంస్కృతిక' ఎగుమతి అవుతుంది!" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో కొనియాడారు.

ఆనంద్ మహీంద్రా ఈ ఆవిష్కరణను గుర్తించి కొనియాడాడు. భారతీయ అల్పాహారాన్ని నిమిషాల్లో తయారు చేయగల వెండింగ్ మెషీన్‌లను ఖచ్చితంగా కలిగి ఉండాలని తెలిపారు. అవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి అయితే, వారి జేబులు/వాలెట్‌లు ఎక్కువగా ఖర్చు చేయరని ప్రజలు ఖచ్చితంగా వాటిని ఆదరిస్తారని తెలిపారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.