Begin typing your search above and press return to search.
చెన్నైలో ప్లాస్టిక్ ఇడ్లీలు
By: Tupaki Desk | 9 Jun 2017 7:16 AM GMTహైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే... ఇంతవరకు పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ కాకపోయినా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట నుంచి దీనికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. తాజాగా చైన్నైలో మరో కలకలం రేగింది. తమిళులకు ఎంతో ఇష్టమైన సాంబార్ ఇడ్లీ కూడా ప్లాస్టిక్ మయమైపోయిందట. సాంబార్ లో ప్లాస్టిక్ వాడకపోయినా ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ వాడకం బయటపడింది.
చెన్నైలోని అన్నానగర్ - తేనాంపేట మండలాల్లోని పలు హోటళ్లపై బుధ - గురువారాల్లో ఆహార భద్రతాశాఖ అధికారులు జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. చెన్నైలో కొన్ని చిన్న - పెద్ద తరహా హోటళ్లలో ఇడ్లీ తయారీలో ప్లాస్టిక్ షీటు ఉపయోగిస్తున్నారంటూ అధికారులకు అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా హోటళ్లలో 11 కిలోల ప్లాస్టిక్ షీటును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అన్నానగర్ మండలంలోనే 30కి పైగా హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. కొన్ని హోటళ్లలో ఇడ్లీలు ఉడికించే ప్రక్రియలో ప్లాస్టిక్ షీటును వినియోగించడం అధికారుల కంట పడింది. ఆయా హోటళ్ల నుంచి 6 కిలోల ప్లాస్టిక్ పేపర్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తేనాంపేట మండల పరిధిలోని నుంగంబాక్కంలో జరిపిన తనిఖీల్లో 5 కిలోల ప్లాస్టిక్ పేపర్ పట్టుబడింది. నిజానికి ప్లాస్టిక్ పేపర్ తయారీలో కొన్ని రసాయనాలు వినియోగిస్తారని, ఇలాంటి పేపర్ పై ఇడ్లీలు ఉడికిస్తే.. ఆ రసాయనాలు ఇడ్లీలలో కూడా కలిసే ప్రమాదముందని అధికారులు చెప్తున్నారు. అయితే.. అధికారులు మాత్రం ఇంత జరిగినా ఆయా హోటళ్ల యజమానులను హెచ్చరించి వదిలేశారంతే. ప్లాస్టిక్ షీట్లపై ఉడికిస్తుండడం ప్రమాదకరమే కానీ, ఇడ్లీ ఇన్ గ్రేడియంట్లలో ప్లాస్టిక్ లేదని అధికారులు తేల్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/