Begin typing your search above and press return to search.

విగ్ర‌హ రాజ‌కీయాలు.. వైసీపీకి అవ‌స‌ర‌మా...?

By:  Tupaki Desk   |   5 Jan 2022 4:30 PM GMT
విగ్ర‌హ రాజ‌కీయాలు.. వైసీపీకి అవ‌స‌ర‌మా...?
X
రాష్ట్రంలో ఇప్పుడు మ‌రోసారి.. విగ్ర‌హ రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు.. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని గుంటూరు జిల్లా దుర్గి మండ‌లంలో ఒక‌రు ధ్వంసం చేశారంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. దీనివెనుక సీఎం జ‌గ‌న్ ఉన్నార‌ని.. ఆయ‌న పార్టీ నేత‌ల‌ను ప్రోత్స‌హించి.. విగ్ర‌హాల‌ను ధ్వంసం చేయిస్తున్నార‌ని.. బాబు విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు కూడా అస‌లు మా నేత‌కు కానీ.. కార్య‌క‌ర్త‌ల‌కు కానీ.. విగ్ర‌హాల రాజ‌కీయం చేయాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నిజానికి వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాలు క‌నిపించ‌కుండా చేసింది ఎవ‌రో ప్ర‌జ‌లు తెలుసున‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

విజ‌య‌వాడ న‌డిబొడ్డున బ‌స్టాండ్ స‌మీపంలో ఉన్న వైఎస్ విగ్ర‌హాన్ని రాత్రికి రాత్రి.. రోడ్డుకు అడ్డు లేకున్నా.. తొలిగించార‌ని.. అప్ప‌ట్లో ఇదంతా కూడా .. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌ని.. అప్ప‌టి పోలీసులు కూడా చెప్పార‌ని.. అయిన‌ప్ప‌టికీ.. తాము రాజ‌కీయంగా దీనిని వాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదని.. అంటున్నారు.. అంతేకాదు, క‌ర్నూలు, రాజ‌మండ్రి, విశాఖ సెంట‌ర్ల‌లో నూ.. వైఎస్ విగ్ర‌హాల‌ను తొల‌గించిన ఘ‌న‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వానిది కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

విగ్ర‌హాల‌తో రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌రం .. వైసీపీ నేత‌ల‌కు లేద‌ని.. ఏదైనా ఉంటే.. టీడీపీ నే అలా చేస్తుంద‌ని అంటున్నారు. రాజకీయంగా.. ఇప్పుడు టీడీపీ అవ‌సాన ద‌శ‌లో ఉంద‌ని.. అందుకే ఏదో ఒక కార్య‌క్ర‌మం పెట్టుకుని విమ‌ర్శ‌లు చేస్తో్ంద‌ని అంటున్నారు. ఇక‌, టీడీపీ మాత్రం విగ్ర‌హాల‌ను ధ్వంసం చేయ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో నిర‌సిస్తోంది. దీనిపై వైసీపీలోని కొంద‌రు మాజీ టీడీపీ నాయ‌కులు కూడా త‌ప్పుప‌డుతున్నారు. ఎన్టీఆర్ విగ్ర‌హానికి చిన్న దెబ్బ‌త‌గిలితే.. బాధ‌ప‌డుతున్న‌నాయ‌కులు.. ఆయ‌న జీవించి ఉండ‌గా.. ఎన్ని క‌ష్టాలు పెట్టారో.. గుర్తుందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఆయ‌న బ‌తికి ఉన్న‌ప్పుడు.. ఆయ‌న‌ను అన్ని విధాలా ఏడిపించిన నాయ‌కులు.. ఇప్పుడు మాత్రం విగ్ర‌హాలకు ఏదో అయిపోతోంద‌ని పేర్కొన‌డం.. యాగీ చేయ‌డం డొల్ల‌త‌న‌మేన‌ని అంటున్నారు. క‌నీసం.. ఎన్టీఆర్ కుటుంబంపైనా సానుభూతి చూపించ‌లేని వ్య‌క్తులు.. ఇప్పుడు విగ్ర‌హాల రాజ‌కీయాలు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని అంటున్నారు. జ‌గ‌న్‌కు విగ్ర‌హాల రాజ‌కీయాలు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. మ‌రి దీనికి టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.