Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్‌కు ఏపీ ఆహ్వానిస్తే.. టీడీపీ తెలంగాణ‌ను ఆహ్వానిస్తుందా?

By:  Tupaki Desk   |   27 Dec 2022 4:38 AM GMT
బీఆర్ఎస్‌కు ఏపీ ఆహ్వానిస్తే.. టీడీపీ తెలంగాణ‌ను ఆహ్వానిస్తుందా?
X
టీఆర్ ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో ఉద్య‌మించేలా.. చేసేందుకు బీఆర్ ఎస్‌గా మార్చిన తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ను ఏపీ ప్ర‌జ‌లు ఆహ్వానిస్తున్నారంటూ.. తెలంగాణ‌లోని కొన్ని ప‌త్రిక‌లు రాసుకొచ్చాయి. ఏపీ ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌ను కోరుకుంటున్నారని.. ఏపీ స‌మ‌స్య‌లపై పోరాడే శ‌క్తి, తెగువ కేసీఆర్ కు మాత్ర‌మే ఉన్నాయ‌ని.. అక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తున్నారంటూ.. కొన్ని ప‌త్రిక‌లు రాసుకొచ్చాయి.

అయితే, ఇది రాజ‌కీయంగా త‌ప్పుప‌ట్ట‌డానికి వీల్లేదు. అదేస‌మ‌యంలో టీడీపీ తెలంగాణ‌లో అడుగు పెడితే.. మాత్రం స‌హించ‌లేక పోవ‌డ‌మే ఇప్ప‌డు చ‌ర్చ‌కు వ‌స్తున్న కీల‌క విష‌యం. ఎందుకంటే.. కేవ‌లం జాతీయ పార్టీలు మాత్ర‌మే ఇత‌ర రాష్ట్రాల్లో అడుగు పెట్టాల‌ని లేదు.

ప్రాంతీయ పార్టీగానే ఉన్న బీఎస్పీ, ఆర్జేడీలు కూడా.. పొరుగు రాష్ట్రాల్లో పార్టీల‌ను ముందుకు న‌డిపిస్తున్నాయి.

అంతెందుకు.. పుదుచ్చేరిలో డీఎంకే, అన్నాడీఎంకేలు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలుగా ఉన్నాయి. సో.. ఏ పార్టీ అయినా.. త‌న ను ఆద‌రించే ప్ర‌జ‌లు ఉన్నార‌ని భావిస్తే.. ఎక్క‌డైనా రాజ‌కీయాలు చేయొచ్చు. కానీ, త‌మ‌కు మాత్ర‌మే పొరుగు రాష్ట్రాల్లో ప్ర‌చారం చేసుకునేందుకు, రాజ‌కీయాలు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే రీతిలో బీఆర్ఎస్ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇది రాజ‌కీయంగా బీఆర్ఎస్‌కు ఇవ్వ‌దేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేసీఆర్ ప‌న్నాగాల‌ను రేపు టీడీపీ ఎండ‌గ‌ట్టే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే తెలంగాణ సెంటిమెంటును రెండు సార్లు వినియోగించుకుని అధికారంలోకి వ‌చ్చిన కేసీఆర్‌.. ఈ ద‌ఫా అది ప‌నిచేయ‌ద‌ని తెలుసుకున్నారు.

ఇప్పుడు ఆయ‌న అనుస‌రిస్తున్న వైఖ‌రి కూడా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తే.. మొత్తానికి రాజకీయంగా ఇబ్బంది త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.