Begin typing your search above and press return to search.

పిల్లలకు ఒమిక్రాన్ వస్తే భయపడాల్సిందే..!

By:  Tupaki Desk   |   19 April 2022 7:30 AM GMT
పిల్లలకు ఒమిక్రాన్ వస్తే భయపడాల్సిందే..!
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి తన రూపును మార్చుకుంటూ ప్రజలపై తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అయితే ఫపస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ ఇలా.. నాలుగు సార్లు కరోనా ప్రపంచ దేశాలపై తన పంజా విసిరింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటికీ దాని వల్ల కొందరు అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారు. అయితే ముందు మూడు వేరియంట్ ల కంటే కూడా ఒమిక్రాన్ వేరియంట్ వల్ల చిన్న పిల్లలపై అధిక ప్రభావం చూపుతోందని నిపుణులు సూచిస్తున్నారు.

ఒమిక్రాన్ కారణంగా పిల్లలో అప్పర్ ఎయిర్ వే ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. ఈ అప్పర్ ఎయిర్ వే ఇన్ఫెక్షన్ లతో హార్ట్ ఎటాక్ సహా ఇతర జటిల సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ ఇని వారు వివరించారు. నేషనల్ కొవిడ్ కొహర్ట్ కొలాబరేటివ్ నుంచి 19 ఏళ్ల లోపు 18 వేల 849 మంది చిన్నారుల డేటాను ఈ అధ్యయనం కోసం తీసుకున్నారు. అమెరికాలోని కొలరాడో, నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ, స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలు ఈ అధ్యయనం చేశాయి. దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించాయి.

ఈ అధ్యయనం ప్రకారం ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల్లో అప్పర్ ఎయిర్ వే ఇన్ఫెక్షన్ ను కల్గించే అకాశం ఉందని తేలించిద. ఒమిక్రాన్ సోకడానికి ముందు, ఒమిక్రాన్ డామినెంట్ గా ఉన్న కాలంనాటి డేటాను పరిశీలిస్తే.. అప్పర్ ఎయిర్ వే ఇన్ఫెక్షన్ల బారిన పడ్డ సగటు పిల్లల వయసు నాలుగేళ్ల ఐదు నెలల నుంచి రెండేళ్ల ఒక నెలకు పడిపోవడం గమనార్హం. కాగా అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ డామినెంట్ గా ఉన్నప్పుడు పిల్లల్లో అప్పర్ ఎయిర్ వే ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అయ్యయాని చెబతున్నారు.

మొత్తంగా 21.1 శాతం పిల్లలు కరోనాతో అలాగే అప్పర్ ఎయిర్ వే ఇన్ఫెక్షన్ లో ఆసుపత్రుల్లో చేరగా.. కొవిడ్ కారణంగా యూఈఏ కేసు ఆరోగ్య వ్యవస్థకు సవాల్ చేసే స్థాయిలో లేవని ఆ పరిశోధన వెల్లడించింది. 2021 డిసెంబర్ నాటికి అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ అధిక ప్రాబల్యంలోకి వచ్చింది.

అత్యధిక వేగంతో వ్యాప్తి చెందే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ తో పోలిస్తే.. తక్కువ తీవ్రత కల్గినదే. ఊపిరితిత్తుల కణజాలంలో వైరస్ రెప్లికేషన్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణం అయి ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కణాల్లో కంటే శ్వాస మార్గాల్లో దాని ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అందుకే చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద వాళ్లు టీకాలు వేసుకున్నందున వారికి పెద్ద అపాయం ఏం లేదని.. కానీ చిన్న పిల్లల పరిస్థితి వేరని తెలిపారు.. చిన్న పిల్లలను అత్యవసరం అయితే తప్ప బయటకు తీసుకెళ్లకూడదు.. ఒకవేళ తీసుకెళ్లినా మాస్కులు, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని వివరిస్తున్నారు.