Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ ఆలా చేస్తే బీజేపీలోకి వెళ్తా ..స్పష్టం చేసిన ఆ ఎంపీ
By: Tupaki Desk | 5 Dec 2020 12:41 PM GMTకాంగ్రెస్ కీలక నేత, టీఆర్ ఎస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ లో చేరబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, పార్టీ మార్పుపై విశ్వేశ్వర్ రెడ్డి గతంలోనే ట్విటర్ వేదికగా పార్టీ మారేది లేదని క్లారిటీ ఇచ్చారు. జీహెచ్ ఎం సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో టీఆర్ ఎస్ ను హైదరాబాద్ లో ఎదుర్కొనేది బీజేపీనే అంటూ బీజేపీ కి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ అయన పార్టీ మారతారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ అంశంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మరోసారి స్పందిస్తూ కాంగ్రెస్‌పై తనకు ఉన్న అసహనాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో కలిస్తే మాత్రం బీజేపీలో చేరతానని క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరును కూడా కొండా తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతల భాష మారాల్సిన అవసరం ఉందని, మాటకు మాట అన్నట్టుగా వారంతా వ్యవహరించాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు క్రమశిక్షణ లేని సైనికులు అంటూ వారిని కొట్టిపారేశారు.
కొందరు కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ జేబులో మనుషులు అన్న అపవాదు మూటగట్టుకున్నామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సంపాదించడంలో వెనుకపడ్డామని చెప్పుకొచ్చారు. ఎవరికి పీసీసీ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్న ఒక మాట మీదకు వచ్చామన్నారు.కేసీఆర్ దగ్గర చిన్న లాఠీ ఉంటే బీజేపీ వద్ద పెద్ద కర్ర ఉందన్న ఆలోచనల్లో జనం ఉన్నారని, అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశాడు.