Begin typing your search above and press return to search.

ఉద్యోగుల‌కు క‌రోనా సోకితే.. ఆ కంపెనీలు ఏం చేస్తాయో తెలుసా?

By:  Tupaki Desk   |   27 April 2021 3:31 PM GMT
ఉద్యోగుల‌కు క‌రోనా సోకితే.. ఆ కంపెనీలు ఏం చేస్తాయో తెలుసా?
X
కొవిడ్ మొద‌టి ద‌శ‌లో.. ప్రైవేటు రంగంలో ఎంత మంది ఉద్యోగాలు ఊడిపోయాయో చెప్ప‌లేం. ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా తీవ్ర సంక్షోభం నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మ ఉద్యోగుల‌కు అండ‌గా నిలుస్తున్నాయి ప‌లు ఐటీ కంపెనీలు. కొవిడ్ కేర్ స‌దుపాయాల‌ను క‌ల్పిస్తూ ఎంప్లాయీస్ ను, వారి కుటుంబ స‌భ్యుల‌ను ఆదుకుంటున్నాయి.

ఇందులో భాగంగా.. ఇన్ఫోసిస్ త‌మ ఉద్యోగుల‌కు క‌రోనా సోకితే 21 రోజుల‌పాటు వేత‌నంతో కూడిన సెల‌వుల‌ను మంజూరు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అదేవిధంగా.. పుణె, బెంగ‌ళూరు న‌గ‌రాల్లోని ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యుల కోసం ప్ర‌త్యేకంగా కొవిడ్ కేర్ సెంట‌ర్లను ఏర్పాటు చేసింది. గ్రూప్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కింద ఉద్యోగులంద‌రికీ కొవిడ్ సంబంధిత వైద్య చికిత్స‌ల‌ను అందిస్తోంది.

ఇంతేకాకుండా.. ఆసుప‌త్రుల్లో చికిత్స అందించేందుకూ సిద్ధ‌మైంది. ఈ మేర‌కు దేశ‌వ్యాప్తంగా 243 న‌గ‌రాల్లోని సుమారు 1500 ఆసుప‌త్రుల‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా.. స్పెష‌ల్ మెడిక‌ల్ బృందంతో ప్ర‌త్యేక వ్యాక్సిన్ డ్రైవ్ ను కూడా నిర్వ‌హిస్తోంది.

ఇక‌, విప్రో ఐటీ కంపెనీ కూడా ఉద్యోగుల కోసం స్పెష‌ల్ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ నిర్వ‌హించింది. క్యాప్ జెమిని కూడా ఉద్యోగుల‌కు అండ‌గా నిలుస్తోంది. కొవిడ్ సోకిన ఉద్యోగులు, వారి కుటుంబ స‌భ్యుల‌కు కంపెనీ త‌ర‌పున ఇన్సూరెన్స్ వ‌ర్తింపజేస్తామ‌ని ప్ర‌క‌టించింది.

ఇది ఖ‌చ్చితంగా ఉద్యోగుల‌కు, కుటుంబాల‌కు ఎంతో ఊర‌ట‌నిచ్చే అంశం. వైద్య ఖ‌ర్చులు ఒకెత్త‌యితే.. ఆసుప‌త్రుల్లో సౌక‌ర్యాలు పొంద‌డం మ‌రో ఎత్తుగా మారిన ప‌రిస్థితులు ఇప్పుడు దేశంలో ఉన్నాయి. అందువ‌ల్ల కంపెనీలు స్వ‌యంగా ఆసుప‌త్రుల‌తో ఒప్పందాలు కుద‌ర్చుకున్న నేప‌థ్యంలో.. త‌మ ఉద్యోగులకు అన్నిర‌కాల సౌక‌ర్యాలు స‌త్వ‌ర‌మే అందే వీలుంది.