Begin typing your search above and press return to search.
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే .. పోలీసుల వార్నింగ్!
By: Tupaki Desk | 10 May 2021 12:30 PM GMTతెలంగాణ లో కరోనా మహమ్మారి , మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే కొంచెం కంట్రోల్ లోనే ఉంది. అయితే , సెకండ్ వేవ్ లో ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకి భారీగా పెరిగిపోతుంది. దీనితో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ , కర్ఫ్యూలు అమలు చేస్తున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం కరోనా ఆంక్షలు కొనసాగిస్తూ నైట్ కర్ఫ్యూ ను కొనసాగిస్తున్నారు . లాక్ డౌన్ వేయాల్సిన పరిస్థితులు లేవని సీఎం కేసీఆర్ సైతం స్పష్టం చేశారు. అయితే కరోనా నియమాలు మాత్రం అందరూ ఖచ్చితంగా పాటించాల్సిందే అని అన్నారు. రాష్ట్రంలో కేవలం నైట్ కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉండటంతో .. ఆ కర్ఫ్యూ ను పక్కాగా అమలు చేసేందుకు పోలీసులను రంగంలోకి దింపింది ప్రభుత్వం. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ మహేశ్ భగవత్ కరోనా నిబందనల అమలుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వెల్లడించారు. బాలాపూర్ పోలీస్ నేషన్ పరిధిలోని ఎర్రకుంట ప్రాంతాల్లో అర్దరాత్రి అకస్మికంగా సందర్శించారు. కరోనా నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని మహేశ్ భగవత్ కోరారు. దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని లేదంటే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనా రాకుండా జాగ్రత్త పడాలన్నారు. రాచకొండ కమీషనరేట్ పరిధిలో 46 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివాహలకు 100 మంది, అంత్యక్రియలకు కేవలం 20 మందికి మించకూడదని తెలిపారు.