Begin typing your search above and press return to search.

డోలో ఎక్కువ వాడితే ఆ సమస్యలు తప్పవు..!

By:  Tupaki Desk   |   2 Feb 2022 8:30 AM GMT
డోలో ఎక్కువ వాడితే ఆ సమస్యలు తప్పవు..!
X
కరోనా వచ్చిన నాటి నుంచి ట్యాబ్లెట్ల వినియోగం బాగా ఎక్కువ అయ్యింది. మరీ ముఖ్యంగా జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గులకు వేసుకునే మాత్రలను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో వీటికి మార్కెట్లో డిమాండ్ బాగా ఎక్కువ అయ్యింది. ఎంతలా అంటే వాటి పేర్లు ప్రతీ ఒక్కరికీ నోట్లో నానేంతగా..

ఇటువంటి టాబ్లెట్లలో ఎక్కువ ప్రజలు కొనుగోలు చేస్తున్న టాబ్లెట్ డోలో 650. కరోనా వచ్చిన తర్వాత ఈ పేరు వినని వారంటూ ఎవరూ ఉండరు. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందింది అంటే దీనిపై సోషల్ మీడియాలో ఏకంగా మీస్ ఓ రేంజ్లో వెల్లువెత్తాయి. దీనికి తోడు కొవిడ్ మొదటి వేవ్ అప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఓ ముఖ్యమంత్రి డోలో పై చేసిన కామెంట్స్ ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలుసు ఈ డోలో 650 ఇంత ప్రాచుర్యం పొందింది. మరలా కొవిడ్ మూడో వేవ్ లో విజృంభిస్తుంటే.. వీటికి డిమాండ్ మరలా పెరిగింది. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగించడం కూడా సైడ్ ఎఫెక్ట్స్ కు దారి తీస్తుంది అని అంటున్నారు నిపుణులు. అందుకే డాక్టర్ సలహాలు పాటించి వేసుకోవాలని చెప్తున్నారు.

మనం ఎడాపెడా ఉపయోగిస్తున్న డోలో 650 వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనికి కేవలం డాక్టర్ సూచన మేరకు మాత్రమే ఉపయోగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. డైరెక్ట్ గా మనమే మందుల షాప్ కి వెళ్లి తెచ్చుకుని వేసుకోవడం తగ్గించాలని చెప్తున్నారు. ఇలా చేయడం కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. దీనికి కారణం లేకపోలేదు. సాధారణ ట్యాబ్లెట్లతో పోల్చితే దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని పరిమాణం కూడా పేరులో ఉన్నట్లే 650 మిల్లీ గ్రాములు ఉంటుంది. వాస్తవానికి ఇది సాధారణ డోసుతో పోల్చితే చాలా ఎక్కువ అన్నమాట. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెబుతున్నారు.

డోలో విరివిగా ఉపయోగిస్తే వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం... డోలోను పిల్లలకి వేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. లేకపోతే వారికి కడుపులో ఒక రకమైన వికారం కలుగుతుందని చెపుతున్నారు. అంతేకాకుండా శరీరం కూడా ఆ మోతాదును తీసుకోలేదని అంటున్నారు. అందుకే చాలా మంది పిల్లలు ఈ టాబ్లెట్ వేసిన తర్వాత మత్తుగా ఉండడం తో నిద్రకు ఉపక్రమిస్తారని గుర్తు చేస్తున్నారు. పెద్ద వారిలో కూడా ఈ మాత్రలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల లో బీపీ వచ్చే సమస్య ఉందని చెబుతున్నారు. దీనితో పాటు తల కూడా దిమ్ముగా ఉన్నట్లు అనిపిస్తుంటుందని, మరి కొంత మందిలో నీరసం కూడా ఆవహిస్తుందని చెప్తున్నారు. ఓ వయసు వారిలో అయితే ఏకంగా మలబద్దకం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని నిపుణులు అంటున్నారు. అందుకే డోలో 650ని వైద్యుల సూచన మేరకు ఉపయోగించడం ఉత్తమం అని చెప్తున్నారు.