Begin typing your search above and press return to search.

ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే... ?

By:  Tupaki Desk   |   18 Nov 2021 1:30 PM GMT
ఏపీలో ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే... ?
X
ఎన్నికలు రాజకీయ నాయకులకు ఎపుడూ కావాలి. అయితే ఇక్కడ తేడా ఉంది. ఓడిపోయిన వారు ఎన్నికలూ అంటూ పాట పాడుతూంటారు. గెలిచిన వారు మాత్రం వాటిని వద్దనుకుంటారు. మరి ఎవరు ఎపుడు కోరినా వెంటనే పెట్టేందుకు ఎన్నికలు లేవు కదా. వాటికి ఒక నియమం, వ్యవహారం అన్నీ ఉన్నాయి. అందువల్ల మనకు బాగున్నపుడు ఎన్నికలు పెట్టేసుకోవడానికి, కూడనపుడు వద్దనుకోవడానికి అసలు కుదరదు. అయితే ఇక్కడ అధికారంలో ఉన్న వారికి చిన్న మినహాయింపు ఉంది.

వారు తమకు పరిస్థితి బాగుంది అనుకున్నపుడు అసెంబ్లీని కానీ పార్లమెంట్ ని కానీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవచ్చు. అయితే అపుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో నిర్ణయం ఉంటుంది. వారు అన్నీ ఆలోచించి ఎన్నికలు పెడితేనే ముదస్తు మంత్రం ఫలించేది.

ఇక ఏపీలో చూసుకుంటే వరసబెట్టి ప్రతీ ఎన్నికలోనూ వైసీపీ గెలుస్తోంది అది 2019 ఎన్నికలతో మొదలుపెడితే ఈ రోజు వరకూ అదే సీన్ కనిపిస్తోంది. మరో వైపు చూస్తే టీడీపీ ఓడుతోంది. దాంతో ఆ పార్టీ నేతలు ఓడిన ప్రతీ సారి ఒక మాట అంటున్నారు.

లోకల్ బాడీ ఎన్నికలు ఉప ఎన్నికలూ ప కొలమానం కాదు, మీకు గెలుస్తామన్న అతి నమ్మకం ఉంటే వెంటనే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు సిద్ధపడాలని కోరుతున్నారు. టీడీపీ ఇలాంటి డిమాండ్ చేయడంతోనే వైసీపీ నేతలు కూడా కౌంటర్లు వేస్తున్నారు. మీకు ఎన్నికలు అంటూ సరదా ఉంటే మీ వైపు ఉన్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి బరిలోకి దిగండి, అందరినీ ఓడించి మాజీలను చేయకపోతే ఒట్టు అంటూ రీ సౌండ్ చేస్తున్నారు.

సరే ఇది వైసీపీ టీడీపీల మధ్యన రాజకీయ రచ్చగా ఎంతలా చూసుకున్నా అసలు ఏపీలో సీన్ ఎలా ఉంది. గ్రౌండ్ లెవెల్ పొజిషన్ ఏ విధంగా ఉంది. వైసీపీని నిజంగా జనాలు అంతలా ప్రేమించేస్తున్నారా. అలా అయితే ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీయే మళ్ళీ గెలుస్తుందా అసలు టీడీపీ కానీ జనసేన, బీజేపీ కానీ సోదిలో కూడా ఉండవా అంటే దాని మీద కూడా అనేక రకాలైన విశ్లేషణలు ఉన్నాయి.

నిజానికి సార్వత్రిక ఎన్నికలు అంటే ఆ సీన్ వేరుగానే ఉంటుంది. అపుడు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో అన్న ఉత్కంఠ ఉంటుంది. అదే టైమ్ లో ఓటరు కూడా అన్నీ ఆలోచించి ఓటేస్తాడు. అందువల్ల లోకల్ బాడీ ఎన్నికలు, ఉప ఎన్నికల పరిస్థితి అయితే పూర్తిగా నూటికి నూరు శాతం ఆ ఎన్నికల్లో ప్రతిబించకపోవచ్చును అన్న మాట కూడా ఉంది.

అయితే ఇప్పటికిపుడు ఏపీలో ఎన్నికలు జరిగితే మాత్రం అధికార పక్షానికే లాభం అన్న చర్చ కూడా ఉంది. దీనికి లాజికల్ గా విశ్లేషించుకుంటే చాలా విషయాలు చెప్పుకోవచ్చు. వైసీపీది ఇప్పటికి సగం పాలన మాత్రమే పూర్తి అయింది. ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద అసంతృప్తి అన్నది లేదనే చెప్పాలి. అదే టైమ్ లో అభివృద్ధి లేకపోయినా సంక్షేమం పరంగా చెప్పిన మాటను నిలబెట్టుకున్నట్లుగానే చూడాలి.

మరో సగం పాలన ఉంది కాబట్టి ఈ సర్కార్ మీద ఆశలు మిగిలే ఉన్నాయి. ఇక విషయం చూస్తే ఇంకా గట్టిగా పుంజుకోలేదు. దాంతో ఎన్నికలు ఇప్పటికిపుడు వెళ్తే మాత్రం వైసీపీయే మరో మారు అధికారంలోకి వస్తుంది అన్నది ఓ విశ్లేషణ.

అయితే 151 సీట్లు మాత్రం ఆ పార్టీకి దక్కే సీన్ లేదు, అదే టైమ్ లో టీడీపీ ఇంత కన్నా ఎక్కువ సీట్లనే తెచ్చుకునే వీలుంటుంది. మరి పదే పదే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళమని అడుగుతున్న టీడీపీ పెద్దలకు ఈ విషయాలు తెలియవు అనుకోగలమా.

కానీ మరో మాట కూడా వినిపిస్తోంది. టీడీపీ కోరినట్లుగా ఈ రోజున అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు జగన్ వెళ్లకపోవచ్చు. అలాగని పూర్తి కాలం పాలన చేసి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తారా అంటే డౌటే అంటున్నారు. సో. తనకు అనువైన సమయాన్ని తీసుకుని తెలంగాణాలో కేసీయార్ చేసినట్లుగా ముందస్తుకు వెళ్ళినా వెళ్ళవచ్చు. సో. అదే జరిగితే అప్పటి పరిస్థితుల బట్టి జనాల తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సిందే.