Begin typing your search above and press return to search.
తాలిబన్లకు చిక్కడం కంటే.. ప్రాణాలు తీసుకోవడమే బెస్ట్!.. హజారా మహిళల ఆవేదన
By: Tupaki Desk | 22 Aug 2021 11:30 PM GMTఅఫ్గాన్‌ను తమస్వాధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్ల విషయంలో ఆ దేశ పౌరుల ఆందోళన మరింత పెరిగింది. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. మరోవైపు ఎలాగైనా దేశం విడిచి పారిపోయేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు వేలాదిగా తరలి వచ్చారు. వీరిని అణచివేసేందుకు తాలిబన్లు హింసను ప్రయోగించారు. తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఇది ఒక పార్శ్వం మాత్రమే. తాలిబన్ల రాజ్యంలో మరో కోణం చూస్తే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది! ముఖ్యంగా `హజారా`(ఇదో సామాజిక వర్గం) వర్గానికి చెందిన యువతులు కనిపిస్తే.. తాలిబన్లు ఎట్టిపరిస్థితిలోనూ వదిలి పెట్టరు. వారిని పైశాచికంగా అనుభవిస్తారు. వెతికివెతికి పట్టుకుని.. వారిని బానిసలుగా చేసుకుంటారు. దీంతో ఇప్పుడు ఈ సమాజం తీవ్ర కల్లోలం చెందుతోంది.
ఒక్కో ఇల్లు వెతికి హజారా అమ్మాయిలను ఎత్తుకెళ్లడానికి, వాళ్లపై అత్యాచారం చేయడానికి తాలిబన్లుఎంతకైనా తెగిస్తారు. ఈ పరిణామాలపై గతంలోనేఅనుభవం ఉన్న హజారా వర్గానికి చెందిన యువతులు ఇప్పుడు భీతిల్లుతున్నారు. తాలిబన్ల పాల్పడే కంటే.. ప్రాణాలు తీసుకోవడమే బెటర్ అని వారు నిర్ణయించుకున్నారు. నిజానికి నిన్న మొన్నటి వరకు ఈ సామాజిక వర్గానికి చెందిన యువతులు కూడా చదువుల్లో ఫస్ట్ ఉన్నారు.కానీ, ఎప్పుడైతే.. అఫ్గాన్.. తాలిబన్ల వశం అయిందో.. అప్పటి నుంచి వీరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తమను తాలిబన్లు చెరబట్టడం ఖాయమని.. ఈ రోజో.. రేపో.. అంతే తప్ప.. అంతకు మించి తమను వారు వదిలి పెట్టబోరని.. వీరు కన్నీరు మున్నీరవుతున్నారు.
``రెండు నెలల క్రితం నా దృష్టంతా డిగ్రీ పూర్తి చేయడం మీదే ఉండేది. రాబోయే సెమిస్టర్ కోసం ఎలా చదవాలి, ఏం చేయకూడదు అని ప్లాన్ చేసుకుంటున్నా. షెడ్యూల్ వేసుకున్నా. అన్నీ సవ్యంగా జరిగేలా ప్రయత్నిస్తున్నా. అప్పటికే తాలిబాన్లు దేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమిస్తున్నారు. చాలా మంది భయపడుతున్నారు. మజార్-ఎ-షరీఫ్ (కాబూల్‌కు నైరుతిగా అతిపెద్ద నగరం)పై వారు పట్టు సాధించే ముందు వరకు నా జీవితం మామూలుగా ఉండేది. కానీ వాళ్లు దానిని ఆక్రమించగానే, ఇక మా పని కూడా అయిపోయిందని నాకు అనిపించింది. తర్వాత వాళ్లు కాబుల్‌ను కూడా ఆక్రమించారు. నగరంలో కాల్పుల శబ్దం మాకు వినిపించింది. తాలిబాన్లు ప్రతి వీధిలోకీ చేరారని మాకు తెలిసింది. ఇక, మాకు రక్షణలేదు. వారికి దొరకడం కన్నా.. మరణమే మంచిది!`` అని ఓ విద్యార్థిని కన్నీటి పర్యంతం కావడం.. చూస్తే.. తాలిబన్ల అకృత్యాలు ఎలా ఉంటాయో అర్ధమవుతుంది.
ఇక, మహిళలు హిజాబ్‌తోపాటూ సంప్రదాయ దుస్తులు ధరించాలని తాలిబాన్లు ప్రకటించారు. దాంతో మహిళలందరూ భయంతో బురఖా, హిజాబ్ ధరిస్తున్నారు. కొన్ని యూనివర్సిటీలు క్లాస్‌లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య తెరలు పెట్టాయి. కొన్ని కుటుంబాలు తమ అమ్మాయిలను చదుకోడానికి బయటకు పంపించడం లేదని తెలుస్తోంది. మహిళలు, 13, 14 ఏళ్ల బాలికలు కూడా బురఖా వేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకు ముందులా లేదు. ఎక్కడ చూసినా తాలిబాన్ ఫైటర్లు తిరుగుతున్నారు. మహిళల హక్కులకు భంగం కలిగించమంటూ ప్రకటిస్తూనే.. అణచివేత ధోరణిని మొదలుపెట్టారు. తాజాగా కాబూల్‌లోని డజన్లకొద్దీ వేశ్య గృహాలను దగ్గరుండి మరీ ఖాళీ చేయించిన తాలిబన్లు.. ఆ స్థానంలో జంతువుల్ని ఉంచారు. దీంతో జంతు పరిరక్షణ సంఘాలు మండిపడుతున్నాయి.