Begin typing your search above and press return to search.
గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ గెలిస్తే.. హార్దిక్ సీఎం.. గంగూలీలా గుండె పోటే..
By: Tupaki Desk | 22 April 2022 9:10 AM GMTకొన్నిసార్లు సెటైర్లు భలే పేలుతుంటాయి. సమయం, సందర్భం కలిసొచ్చి హిట్ అవుతుంటాయి. ఇలాంటి సందర్భంలో సెటైర్ వేసిన వ్యక్తి హీరో అవుతాడు. అదే కొన్నిసార్లు సెటైర్లు వికటిస్తూ కూడా ఉంటాయి. అలాంటప్పుడు సెటైర్ వేసిన వారు విలన్ గా మారుతారు. ఇక కొన్నిసార్లు సందర్భానికి తగినట్లు.. వేసే సెటైర్లు అవునా అనిపిస్తుంటాయి. ఇందులో రాజకీయ కోణం ఉంటే నిజమే కదా? అని కూడా అనిపిస్తాయి. ఈ కోవలోనిదే స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
నాడు అర్ణవ్ గోస్వామిని విసిగించి..
జీవన గమనంలో ఎదురయ్యే కొన్ని సందర్భాల నుంచి కామెడీని పుట్టించి కునాల్ కమ్రా స్టాండప్ కమెడియన్ గా ఎంతటి పేరు సంపాదించాడో అందరికీ తెలిపిందే. రాజకీయాలు, బ్యాచిలర్ జీవితంపై అతడు వేసే జోకులు పేలుతుంటాయి. అందరికీ ఆ విధంగానే దగ్గరయిన కునాల్ .. సామాజికంగానూ ఆలోచిస్తుంటాడు. ప్రధానంగా సోషలిస్టు-వామపక్ష భావజాలం అంటే.. మతపరమైన విధానాలకు వ్యతిరేకిగా కనిపిస్తుంటాడు. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాల పట్ల విముఖత ప్రదర్శిస్తుంటాడు. మోదీవి మత రాజకీయాలు అనేది కునాల్ అభిప్రాయంగా తెలుస్తుంటుంది.
ఇదే కోవలో చూస్తే.. ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణవ్ గో స్వామి.. మోదీ అనుకూల డిబేట్లతో ప్రసిద్ధి. ఈయనను జాతీయ వాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా భావిస్తుంటారు కొందరు. అయితే, కునాల్, అర్ణవ్ గోస్వామి 2020 జనవరిలో ఓ విమానంలో తారసపడ్డారు. ఇదే అదనుగా కునాల్ తన ప్రశ్నలతో అర్ణవ్ ను విసిగించాడు. ‘‘మీ మోదీ.. మీ మోదీ’’ అంటూ అర్ణవ్ ను పదేపదే టార్గెట్ చేశాడు. దీనిపై అర్ణవ్ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశాడు. దీంతో కునాల్ పై మూడు ప్రైవేటు విమాన సంస్థలు నిషేధం విధించాయి. ఇదంతా అప్పట్లో ప్రముఖంగా వచ్చింది.
ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ తో ముడిపెట్టి..
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కొత్తగా అడుగుపెట్టింది. పెద్దగా అంచనాల్లేకున్నా సమష్టి ప్రయత్నంతో ఆరు మ్యాచ్ లకు గాను అయిదింటిలో గెలిచి టేబుల్ టాపర్ గా నిలిచింది. దీని కెప్టెన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అనే సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోకపోవడంతో హార్దిక్ ఈసారి గుజరాత్ టైటాన్స్ కు వచ్చాడు. కెప్టెన్ గా అదరొగడుతూ జట్టను మంచిగా నడిపిస్తున్నాడు. స్వతహాగా హార్దిక్ గుజరాతీనే. రంజీల్లో బరోడాకు ఆడుతుంటాడు. కాకపోతే.. ఐపీఎల్ లో ముంబై తరఫున వెలుగులోకి వచ్చి టీమిండియాకు ఎంపికయ్యాడు.
అయితే, ఈసారి ముంబై రిటైన్ చేసుకోకపోవడం, గుజరాత్ కెప్టెన్ కావడం జరిగిపోయాయి. దీనిని
గుర్తు పెట్టుకుని కునాల్.. ఓ బాంబులాంటి సైటెర్ వేశాడు. ‘‘ఈసారి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ టైటిల్ నెగ్గితే హార్దిక్ పాండ్యా తర్వాతి ఎన్నికల్లో (2022 నవంబరు) గుజరాత్ బీజేపీ సీఎం అభ్యర్థి అతడే. ఇది సాధ్యమే. దాదా (సౌరభ్ గంగూలీ)లా చిన్న వయసులో గుండె పోటుకు గురి అయినట్లు..’’ అంటూ ట్వీట్ చేశాడు.
గంగూలీని ప్రస్తావిస్తూ
కునాల్.. తన ట్వీట్ లో పరోక్షంగా గంగూలీని ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. గతేడాది బెంగాల్ ఎన్నికల ముందు గంగూలీని బీజేపీలోకి లాగేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఒత్తిడిని తట్టుకోలేకే అతడు గుండె పోటుకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడు. అయితే, గంగూలీకి ఉన్న క్రేజ్ రీత్యా నాడు అతడిని బెంగాల్ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ ఆలోచించింది. కానీ, సీన్ రివర్స్ అవడం.. ఆఖరికి మమతా బెనర్జీ చేతిలో బీజేపీ పరాజయం అందరికీ తెలిసిందే. ఇప్పుడదే అంశాన్ని పట్టుకుని కునాల్ తన ట్వీట్ కు జోడించాడు.