Begin typing your search above and press return to search.

2014 ఎన్నికల్లో జగన్ సీఎం అయితే రాజధాని అది అయ్యిండేదా?

By:  Tupaki Desk   |   20 Aug 2020 7:50 AM GMT
2014 ఎన్నికల్లో జగన్ సీఎం అయితే రాజధాని అది అయ్యిండేదా?
X
2014 ఎన్నికల్లో ఒక వేళ టీడీపీ ఓడిపోయి వైసీపీ గెలిచి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్ అప్పుడే సీఎం అయితే ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను ఉపయోగించుకొని వెనుకబడిన ఒంగోలు జిల్లాలోనే రాజధాని పెట్టేవాడని అంటున్నారు.

చంద్రబాబు గెలిచిన తరువాత కమీషన్లు దండుకోవడానికే దందాకు ఉపయోగపడని దోనకొండను వదిలేసి అమరావతిని ఎంచుకున్నాడని.. చంద్రబాబు చేసిన పాపం ఈ రోజు ప్రకాశం జిల్లా ఇంకా వెనుకబడి పోవడానికి కారణమైందని ఆ జిల్లా వాసులు వాపోతున్నారు.

సరే చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతిని అయినా ఆయినా ఐదేళ్ల కాలంలో పూర్తిగా అభివృద్ధి చేయకుండా.. దోనకొండను పట్టించుకోకుండా ఈ ప్రాంతం అభివృద్ధి కాకుండా బాబు అథోగతి పాలు చేశాడని ఆ ప్రాంత వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇప్పుడు సీఎం అయిన జగన్ కు వేరే ఆప్షన్ లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదేనంటున్నారు. ఎందుకంటే వైజాగ్ మీద జగన్ కు ఏమీ ప్రేమ లేదు. కానీ రాజధాని కూడా లేని ఆంధ్రా రాష్ట్రం వద్ద పెద్దగా డబ్బులు లేవు కాబట్టి అభివృద్ధి అయిన నగరాన్ని రాజధానిగా చేస్తే తొందరగా ఏపీ డెవలప్ మెంట్ సాధ్యం. టాక్స్ ల రూపంలో డబ్బులు వస్తాయి.. అందుకే జగన్ దోనకొండను వదిలేసి విశాఖను రాజధానిగా ప్లాన్ చేశాడని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో గ్రామాలకు పెద్దగా అవసరం పడకుండా.. జగన్ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నాడని విశ్లేషిస్తున్నాయి.

మొత్తంగా ఏపీకి ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటుకు.. విశాఖ పరిపాలన రాజధాని కావడం వెనుక ప్రధాన కారణం చంద్రబాబు చేసిన తప్పిదాలేనని వైసీపీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి.