Begin typing your search above and press return to search.
జగన్ జైలుకు వెళ్తే.. కాపును ముఖ్యమంత్రి చేస్తారా?
By: Tupaki Desk | 28 Jun 2023 9:14 PM GMTఏపీ సీఎం జగన్ పై అనేక కేసులు ఉన్నాయని.. ఆయా కేసుల్లో ఇప్పటికే ఆయన 16 నెలలు జైలు లో ఉండి వచ్చారని.. రేపు ఒకవేళ ఆయన పై కేసుల విచారణ పూర్తయి.. దోషి గా తేలితే.. ముఖ్యమంత్రి సీటు ను ఎవరికి ఇస్తారని.. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ప్రశ్నించారు. జగన్ పై క్విడ్ ప్రో కో, మనీలాండరింగ్ సహా 50 కేసులు విచారణ దశ లో ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు తాజాగా ముఖ్యమంత్రి జగన్ కు జోగయ్య లేఖ రాశారు.
"మీ పై 50 కేసుల్లో విచారణ జరుగుతోంది. ఒకవేళ మీరు దోషి గా తేలితే, మీ తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఏదైనా కేసు లో కోర్టు మిమ్మల్ని దోషి గా ప్రకటించి మీరు రాజీనామా చేస్తే.. సీఎం పీఠాన్ని రెడ్లకు ఇస్తారా, లేక కాపుల కు ఇస్తారా? చెప్పే ధైర్యం ఉందా? జైలు కు వెళ్తూ.. సీఎం సీటు ను కాపుల కు ఇస్తే.. లేక బీసీల్లోని బడుగు బలహీన వర్గాల వైపు మొగ్గు చూపితే .. మేమంతా గర్వపడతాం" అని జోగయ్య తన లేఖలో జగన్ ను ప్రశ్నించారు.
అదేవిధంగా జోగయ్య ఇటీవల కాలంలో వెలుగు లోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం పైనా సీరియస్ అయ్యారు. జనసేన అధినేత పై ముద్రగడ చేసిన విమర్శల ను ఆయన మరోసారి తప్పుబట్టారు. కాపుల కోసం ఎన్నో పోరాటాలు చేసిన ముద్రగడ పై ఇప్పటికి వరకు తనకు సదభిప్రాయం ఉందని, కానీ, జనసేన అధినేత పై చేసిన విమర్శలతో అది పూర్తిగా పోయిందని వ్యాఖ్యానించారు. ఏవో పదవులు ఆశించి కాపు సామాజిక వర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టే కాపు నాయకుల జాబితో ముద్రగడ కూడా చేరిపోయారని దుయ్యబట్టారు.
గత ఎన్నికల కు ముందు కాపుల కు రిజర్వేషన్ కల్పించలేనన్న జగన్ ను ముద్రగడ ఎందుకు వ్యతిరేకించలేదని జోగయ్య ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన తెర వెనుక జగన్ కు మద్ధతు పలికి, జనసేన కు ఓట్లు పడకుండా చేశారని ఆరోపించారు. ఉద్యమం మధ్యలో రాజీనామా చేసి కాపు ఉద్యమాన్ని గోదావరి లో కలిపేశారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పై అభాండాలు వేస్తున్నారని హరిరామ జోగయ్య మండిపడ్డారు.