Begin typing your search above and press return to search.
కేసీఆర్ రాలేదు సరే కేటీఆర్ వెళ్లలేదెందుకు?
By: Tupaki Desk | 6 Feb 2022 10:35 AM GMTతెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు చాలా ఆగ్రహంతో ఉన్నారు. తమకు బిగ్ బాస్.. దేశ ప్రజలకు ప్రధానిగా ఉన్న అంత పెద్ద మోడీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే.. ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్న కోపంతో వారున్నారు. ప్రధాని హోదాలో ఉన్న వారు రాష్ట్రానికి వస్తే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్.. కనీసం స్వాగతం చెప్పటానికి కానీ వీడ్కోలు పలకటానికి కానీ రాకుండా ఉండటమేంటి? అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు ఆగ్రహం.. వారు తీసే లా పాయింట్ల జోరుకు స్పూర్తి పొందిన మరికొందరు ఔత్సాహికులు మరిన్ని ప్రశ్నల్ని సంధిస్తున్నారు.
అయితే.. ఇలాంటి వారు లాజిక్ మిస్ అయి అడ్డంగా బుక్ అవుతున్నారు. అలాంటి ప్రశ్నల్లో ప్రధానమైనది.. మోడీ లాంటి ముఖ్యనేత రాష్ట్రానికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎయిర్ పోర్టుకు వెళ్లటం కుదరదు అనుకోండి. ఆయనకు బదులుగా తరచూ ఓపెనింగ్ లు.. శంకుస్థాపనలు చేసే స్టార్ మంత్రి కేటీఆర్ ను పంపొచ్చు కదా? అన్న సందేహం పలువురిలో కలగటమే కాదు.. ఇదే విషయాన్ని మరికొందరితో షేర్ చేసుకుంటున్నారు.
అయితే.. ఇలా ప్రశ్నించే వారికి విషయాలు పూర్తిగా తెలీకే ఇలా ప్రశ్నిస్తున్నారని చెప్పాలి. ప్రధాన మంత్రి స్థాయి నేతలు వస్తుంటే.. ప్రధానమంత్రి కార్యాలయానికి స్వాగతం పలికే ప్రముఖులు జాబితాను ముందే పంపుతారు. వీడ్కోలుకు సంబంధించి ఎవరెవరు ఉంటారన్న దానికి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఇలా రెండు జాబితాల్ని పీఎంవోకు పంపింది తెలంగాణ ప్రభుత్వం. అందులో మంత్రి తలసాని శ్రీనివాస్ పేరును మినిస్టర్ ఆఫ్ వెయిటింగ్ అన్న పేరుతో తలసాని పేరు జాబితాలో ఉంది.
ఇదంతా చూసినప్పుడు.. తామేం చేసినా లెక్క ప్రకారమే చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొట్టిన కార్యక్రమానికిమరో మంత్రి కేసీఆర్ హాజరు కాకపోవటానికి కారణం.. ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిన జాబితాలో కేటీఆర్ పేరు లేకపోవటమేనని చెబుతున్నారు. లేదంటే ఎంచక్కా కేటీఆర్ ను పంపేవాళ్లరంటూ చేస్తేన్న వాదనను విన్నోళ్లంతా.. కవరింగే కవరింగ్ అన్న మాట కొందరి నోటి నుంచి రావటం గమనార్హం.