Begin typing your search above and press return to search.
బెంగాల్ ప్రచారంలో మోడీ ఉంటే.. ప్రజలు చచ్చిపోవాలా?
By: Tupaki Desk | 17 April 2021 3:30 PM GMTమొన్న 2 లక్షలు.. నిన్న 2.17లక్షలు.. ఈ రోజు 2.34 లక్షలు. అంటే.. మూడు రోజుల్లో ఆరున్నర లక్షల మంది కరోనా పాజిటివ్ అయిన వారు. ఇది కేవలం అధికారికంగా వెల్లడైన గణాంకాలు మాత్రమే. అనధికారికంగా మరెంతమంది పాజిటివ్ అయ్యారన్నది తెలీదు. ఎందుకంటే.. పాజిటివ్ లు మొత్తాన్ని ప్రభుత్వం పక్కాగా చెబుతుందా? అన్న సందేహాలు ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆ సందేహం అలా ఉంటే.. మరోవైపు దేశంలోని ఐదారు రాష్ట్రాలు (మహారాష్ట్ర.. ఉత్తరప్రదేశ్.. గుజరాత్.. పంజాబ్.. ఢిల్లీ.. ఉత్తరాఖండ్) పాజిటివ్ కేసులు మాత్రమే కాదు ప్రాణాలు పోతున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.
కుప్పలు కుప్పలుగా పెరిగిన రోగులు ఒకపక్క.. వారికి అవసరమైన మందులు.. అత్యవసర వైద్యం కోసం ఆక్సిజన్ తో పాటు.. రెమిడెసివర్ లాంటి వాటికి తీవ్రమైన కొరత ఉంది. ఇదొక్కటే కాదు.. వ్యాక్సిన్ కోసం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కిందామీదా పడిపోతున్నాయి. ఏ రోజుకు ఆ రోజు అన్నట్లు డైలీ బేసిస్ లో వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇలా అన్నింటికి కొరత మాట తీవ్రంగా వినిపిస్తున్న వేళ.. ప్రధాని మోడీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే షాక్ తినాల్సిందే.
అన్నింటికి మించి తమ రాష్ట్రంలో ఆక్సిజన్ .. రెమిడెసివర్ లాంటివి నిండుకోవటంతో అర్జెంట్ గా వాటిని తమకు పంపాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకోరుతున్నారు. ఏదో మాట వరసకు కాకుండా.. ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించారు. తాము కోరింది వెంటనే పంపాలని కోరారు. దీనికి స్పందించిన పీఎంవో చెప్పిన సమాధానం వింటే షాక్ తినాల్సిందే.
ఎందుకంటే.. ప్రధాని మోడీ ప్రస్తుతం బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారట. ఆయన ఒకసారి ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆయన్ను సంప్రదించి సమాధానం ఇస్తామని పేర్కొన్నట్లుగా మీడియా ప్రముఖుడు రాజ్ దీప్ సర్దేశాయ్ ట్వీట్ ద్వారా వెల్లడించిన సంచలనంగా మారారు. ఒకపక్క దేశవ్యాప్తంగా రోజుకు 2.34లక్షల మంది పాజిటివ్ లు బయటకు వస్తున్న వేళ.. పరిస్థితిని చక్కదిద్దటం.. రాష్ట్రాలకు అవసరమైన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉండాల్సిన ప్రధాని.. బెంగాల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లటం ఏమిటి? అక్కడ తలమునకలై ఉండటం ఏమిటి? ప్రాణాలు పోతుంటే.. ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వటం ఏమిటి?