Begin typing your search above and press return to search.
5 నెలలు.. మూడుసార్లు.. మోడీ గురి పెడితే ఇలానే ఉంటాది
By: Tupaki Desk | 2 July 2022 3:51 AM GMTఒక్కసారి గుర్తు తెచ్చుకోండి.. తెలంగాణ ఏర్పడిన 2014లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నిసార్లు వచ్చారన్నది ఆలోచిస్తే.. సమాధానం వెంటనే తట్టకపోవచ్చు. కానీ.. అదే ప్రధాని మోడీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా తరచూ హైదరాబాద్ కు వస్తున్న వైనం చూస్తే ఆశ్చర్యానికి గురి కాక మానదు. మోడీ గురించి.. ఆయన స్టైల్ గురించి తెలిసిన వారికి ఇదంతా మామూలే.
ఎందుకంటే.. తాను టార్గెట్ చేసిన రాష్ట్రానికి తరచూ రావటం.. ఏదో ఒక కార్యక్రమానికి హాజరు పేరుతో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించటం.. తాము పెట్టుకున్న టార్గెట్ కు తగ్గట్లే.. అధికారంలోకి రావటం జరుగుతుంటుంది. ఒకట్రెండు రాష్ట్రాల్లో ఇలాంటి వ్యూహం వర్కువుట్ కాకపోవచ్చు కానీ.. చాలా రాష్ట్రాల్లో సత్పలితాల్నే ఇచ్చిందని చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలన్న పట్టుదలతో ఉన్న మోడీషాలు.. అందుకు తగ్గట్లే రోడ్ మ్యాప్ ను సిద్దం చేయటమే కాదు.. దాన్ని అమలు చేస్తున్నారు కూడా. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు చెక్ చెప్పి.. తమ ప్రభుత్వ ఏర్పాటు కోసం మోడీ అమితంగా శ్రమిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా గడిచిన ఐదు నెలల వ్యవధిలో మూడోసారి ఆయన తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు.
వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ మహానగరాన్ని వేదికగా చేసుకొనికార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఇంత తరచుగా.. ఇంత స్వల్ప వ్యవధిలో హైదరాబాద్ కు నరేంద్ర మోడీ వస్తున్నది ఇదేనన్న మాట వినిపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో ఫిబ్రవరి మొదటి వారంలో శంషాబాద్ కు సమీపంలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతా మూర్తి భారీ విగ్రహాన్ని ఆరంభించటం కోసం వచ్చిన నరేంద్ర మోడీ.. మే చివరి వారం (మే26న) ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో జరిగిన 20వ వార్షికోత్సవానికి హాజరయ్యారు.
తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కావటంతో ఆయన మరోసారి హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ రోజు (శనివారం) హైదరాబాద్ కు చేరుకుంటున్న ఆయన రెండు రోజులు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న మోడీ.. అందుకు తగ్గట్లే రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయటమే కాదు.. తాను కూడా అందులో ప్రత్యక్షంగా పాల్గొనటం ద్వారా..
పార్టీ నేతలకు.. కార్యకర్తలకు ఇవ్వాల్సిన సందేశాన్ని ఇస్తున్నారని చెప్పక తప్పదు. మొత్తంగా చూస్తే..ఏదైనా రాష్ట్రంలో అధికారం కోసం మోడీ టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందన్న దానికి తాజా పరిణామాలే నిదర్శనమని చెప్పక తప్పదు.