Begin typing your search above and press return to search.
మంగళగిరిలో ఓడిపోతే లోకేష్ నెక్ట్స్ స్టెప్ అదేనా?
By: Tupaki Desk | 1 May 2019 7:31 AM GMTలోకేష్ పోటీ చేయక చేయక మంగళగిరి నుంచి పోటీకి దిగి పెద్ద రిస్కే చేశారు. పార్టీ గెలిచే అవకాశాలున్న సీట్లలో లోకేష్ పోటీ చేసి ఉంటే అదో లెక్క, మరి ఏం సర్వేలు చేయించుకున్నారో, ఏం అనుకున్నారో కానీ..లోకేష్ ను మంగళగిరి నుంచి పోటీకి నిలిపారు.
మొదట్లోనేమో లోకేష్ అక్కడ గెలుస్తారనే అనుకున్నారు. ఆ మేరకు సర్వే రిపోర్టులు వచ్చాయట. తీరా లోకేష్ అక్కడ పోటీకి దిగాకా పరిస్థితి మారిపోయింది. పార్టీకి అండగా ఉంటారనుకున్న వాళ్లు తమ దారి తాము చూసుకున్నారు. దీంతో లోకేష్ కు ఓటమి తప్పదనే అంచనాలకు వచ్చారు అంతా.
మంగళగిరిలో గెలవడం విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తూ ఉంది. మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి నెగ్గితే అప్పుడు లోకేష్ ది విపత్కర పరిస్థితి అవుతుంది!
ఇప్పటికే నారా లోకేష్ కు 'పప్పు' ఇమేజ్ వచ్చింది. తన మాట తీరుతో ఆ నేమ్ ను సార్థకం చేసుకుంటున్నారాయన. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కూడా ఓడిపోతే ఆయనకు రాజకీయ భవితవ్యం కొశ్చన్ మార్క్ అవుతుంది. ఆఖరికి తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలన్నా లోకేష్ బాబుకు అంత తేలిక ఏమీ కాదు.
ఎమ్మెల్యేగా నెగ్గలేని వ్యక్తికి పార్టీ అధ్యక్ష పగ్గాలు ఇవ్వడం ఏమిటనే ప్రశ్న రానే వస్తుంది. అందుకే లోకేష్ కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతే పార్టీ పగ్గాలను అందుకునే అవకాశాలు లేవట. ఆయన వేరే రంగం మీద దృష్టి పెట్టవచ్చని అంచనా.
ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు కుటంబానికి వేరే వ్యాపారం ఉంది. అదే హెరిటేజ్. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో బ్రహ్మాండంగా ఆ వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్నారు. అయితే దాని బాధ్యతలు చంద్రబాబు భార్య భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రహ్మణి చేతిలో ఉన్నాయి. దీంతో లోకేష్ అందులోకి ఎంటర్ కాలేడు.
అందుకే .. లోకేష్ సినీ రంగం మీద దృష్టి పెట్టబోతున్నారట. భారీ ఎత్తున సినిమాలను రూపొందించే ఆలోచన ఉందట లోకేష్. ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి - తను ఎమ్మెల్యేగా ఓడిపోతే లోకేష్ బాబు సినిమాలు రూపొందించనున్నారని, నిర్మాతగా వ్యవహరించడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు బాలకృష్ణతో చర్చలు మొదలయ్యాయని.. భారీ ఎత్తున సినీ నిర్మాణానికి తెర లేపడానికి లోకేష్ రెడీ కాబోతున్నారని వినికిడి!