Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ చేయగలిగిన పని కేసీఆర్ ఎందుకు చేయకూడదు?

By:  Tupaki Desk   |   26 Oct 2022 1:19 PM GMT
ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ చేయగలిగిన పని కేసీఆర్ ఎందుకు చేయకూడదు?
X
మన తెలుగు హీరోలు చేసి నిరూపించిన పనిని తెలంగాణ సీఎం చేయలేడా? మన హీరోలు ప్యాన్ ఇండియా లెవల్ లో సినిమాల్లో సత్తా చాటినప్పుడు మన కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో సత్తా చాటలేడా? ఇప్పుడు ఇదే ప్రశ్నను మంత్రి కేటీఆర్ నుంచి గులాబీ నేతల వరకూ ట్రెండ్ చేస్తున్నారు.

తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ మరోసారి నొక్కి చెప్పారు. ప్యాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్ కావడం ఖాయమని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు.

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు దేశవ్యాప్త రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తన పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనయుడు కేటీఆర్‌ను' కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని కలలుకంటున్నారా'అని ప్రశ్నించగా, దానికి కేటీఆర్ ఆసక్తిగా బదులిచ్చాడు. "2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారు. ఆయనే మొదటి వ్యక్తి అవుతారు. దక్షిణ భారతదేశంలో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైంది కేసీఆర్ మాత్రమే అవుతారు.' అంటూ చెప్పుకొచ్చారు.

"కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఒక ముఖ్యమంత్రి 15 ఏళ్లపాటు తన పదవిని కొనసాగించగలిగితే, ప్రతి భారతీయుడు ఆ ముఖ్యమంత్రి వైపు చూస్తాడు” అని ఆయన అన్నారు.

కెటిఆర్ మాట్లాడుతూ, "బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కార్తికేయ 2 వంటి తెలుగు సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో అత్యధిక వసూళ్లు రాబట్టగలిగితే, తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు దేశానికి ప్రధానిగా కాకూడదు అంటూ వెనకేసుకొచ్చాడు.

ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ చేయగలిగిన పని కేసీఆర్ ఎందుకు చేయకూడదు? అని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు. 'గుజరాత్‌కు చెందిన ఎవరైనా వచ్చి దేశాన్ని అస్తవ్యస్తంగా పరిపాలించగలిగితే, సానుకూల మార్పు తీసుకురావడానికి తెలంగాణకు చెందిన వారు ఎందుకు ప్రధాని కాకూడదు' అని కూడా కేటీఆర్ అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.