Begin typing your search above and press return to search.
పర్రా ఓపెన్ కావాలంటే.. ఆ ముగ్గురి ముద్రలు పడాల్సిందే
By: Tupaki Desk | 30 Oct 2020 10:30 AM GMTవిషయం ఏదైనా కావొచ్చు.. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టేలా చెప్పటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తాజాగా ధరణి వెబ్ పోర్టల్ ను షురూ చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కొన్ని విషయాల్ని సాంకేతిక భాషలో కాకుండా.. రోజువారీ మాటల్లో వివరించి చెప్పటం విశేషం. కంప్యూటర్ స్రీన్ మీద పేజ్ ఓపెన్ కావాలన్న మాటను.. గ్రామీణులకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నప్పుడు.. కొన్ని ఇంగ్లిషు పదాలకు ఇంత తేలిగ్గా తెలుగీకరించే అవకాశం ఉందా? అనుకోక మానరు.
ధరణి పోర్టల్ లో భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే.. అందుకు అవసరమైన పేజీ ఓపెన్ కావాలంటే.. ముగ్గురి వేలిముద్రలు తప్పనిసరి. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ గ్రామీణులకు సైతం అర్థమయ్యేలా చెప్పేందుకు ఏం చెప్పారన్నది చూస్తే.. ‘‘ఎవరి పేరు మీదైనా భూమి రిజిస్ట్రేషన్ కావాలన్నా.. చివరకు నా పేరు మీద రిజిస్టర్ కావాలంటే.. నా వేలి ముద్ర.. ఎమ్మార్వో వేలిముద్ర.. భూమిని అమ్మే వారి వేలిముద్ర పడితే కానీ ధరణిలో పర్రా ఓపెన్ కాదు. గతంలో రిజిస్ట్రేషన్ చేసి.. చేయలేదని చెప్పేవారు. తాజాగా అలాంటి వాటికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎమ్మార్వో వేలిముద్ర పడిన తర్వాతే పర్రా (పేజీ) ఓపెన్ కాదు.
ఏదైనా జరిగితే ఎమ్మార్వోనే బాధ్యుడు. గరిష్ఠంగా పదిహేను నిమిషాల్లో పాస్ బుక్.. మ్యుటేషన్ వివరాలు మారుతాయి. భూమిని కొనే వ్యక్తికి గతంలో పాస్ బుక్ లేకుంటే.. అలాంటి వ్యక్తికి పాస్ బుక్ ఇస్తారు.కాకుంటే వెంటనే రాదు. పోస్టల్ ఛార్జీలు కట్టాక.. ఏడెనిమిది రోజుల్లో వచ్చేస్తుంది’’ అని వివరంగా చెప్పుకొచ్చారు.
జనాలకు అర్థమయ్యే భాషలో విషయాన్ని ఇంత స్పష్టంగా చెప్పటం కేసీఆర్ సక్సెస్ లో కీలకమని చెప్పాలి. రైతుబంధు నిధుల బదిలీలో ఇంతకుముందు కొన్ని ఇబ్బందులు ఉండేవని.. ఇప్పుడు మొత్తం రికార్డు ఉండటంతో.. ఎవరి పైరవీలు అక్కర్లేదని.. నేరుగా నిధులు ఖాతాలోకి పడతాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతంలో ఉన్నవే కొనసాగిస్తున్నామని.. రూపాయి కూడా పెంచలేదన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గిందని.. కేంద్రం జీఎస్టీ ఎగవేస్తున్నా.. సంక్షేమ కార్యక్రమాల్ని ఆపలేదన్నారు. కేవలం 48 గంటల్లో 58 లక్షల మంది రైతులకు డబ్బులు వేసినట్లు పేర్కొన్నారు.