Begin typing your search above and press return to search.
పోస్ట్ కొవిడ్ లక్షణాలను లైట్ తీసుకుంటే.. లైఫ్‌కే రిస్క్
By: Tupaki Desk | 12 Jun 2022 2:30 AM GMTకరోనా మహమ్మారి.. కంటికి కనిపించకుండా ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. దాదాపు ప్రపంచ దేశాలన్నింటికీ ఈ మహమ్మారి సోకింది. అన్ని దేశాల స్థితిగతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. దీని ఎఫెక్ట్‌తో అన్ని రంగాలు కుదేలైపోయాయి. దశలు మారుతూ.. ప్రతి వేవ్‌లో కొత్తరూపంలో ప్రజలపై దండెత్తింది. ఇప్పటికే మూడు దశల్లో లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. మరెంతో మందిని అనాథలుగా మార్చింది. చాలా మందిని రోడ్డు మీద పడేసింది. వైరస్ సోకినప్పుడు బాధితులను ఎంత వేదనకు గురి చేసిందో.. తగ్గిన తర్వాత కూడా అంతే తీవ్రంగా వేధిస్తోంది. కరోనా సోకి తగ్గిన వారిలో ఇప్పటికీ అడపాదడపా లక్షణాలు బయటపడుతూనే ఉన్నాయి. వీటినే దీర్ఘకాల కొవిడ్ లక్షణాలుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.
ఏ వ్యాధి తీవ్రంగా సోకినా.. తగ్గిన తర్వాత దాని లక్షణాలు కొద్దిగా కనిపిస్తాయి. కానీ అంతే తీవ్రంగా బాధిస్తాయి. వీటనే పోస్ట్ డిసీజ్ సిండ్రోమ్స్ అంటారు. అయితే కంటికి కనబడకుండా.. గాల్లో తిరుగుతూ.. క్షణాల్లో వ్యాపిస్తోన్న కరోనా మహమ్మారి.. సోకిన వారిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కలిగిస్తోందో.. తగ్గిన తర్వాత కూడా దాని ప్రభావాన్ని చూపిస్తోంది. ఒకసారి సోకి తగ్గిన తర్వాత అంతటితో ఆగకుండా శరీరంలోనే ఏదో మూలన తిష్టవేసుకుని అప్పుడప్పుడు నేనింకా మిమ్మల్ని వదల్లేదు అంటూ గుర్తుచేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందిలో పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్స్ కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా కొవిడ్ బారి నుంచి కోలుకున్న వారిలో ఛాతిలో నొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఎప్పుడూ మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ దీర్ఘకాలిక లక్షణాలతో బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వీటినే నిపుణులు దీర్ఘకాలిక కొవిడ్ లక్షణాలుగా అభివర్ణించారు. ముఖ్యంగా ఇవి వృద్ధులు, స్థూలకాయం ఉన్నవారు, మహిళల్లో బయటపడుతున్నాయని నిపుణులు తెలిపారు. ఈ లాంక్ కొవిడ్ లక్షణాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలపై నోయిడాకు చెందిన మెట్రో హాస్పిటల్ డాక్టర్ దీపక్ తల్వార్ ప్రత్యేకంగా కొన్ని విషయాలను పంచుకున్నారు.
‘కరోనా నుంచి కోలుకున్న వారిలో పోస్ట్ కొవిడ్ లక్షణాలు భారీగా బయటపడుతున్నాయి. మా అవుట్ పెషేంట్ డిపార్ట్‌మెంట్‌కు వస్తున్న వారిలో 50 శాతం మంది కరోనా నుంచి కోలుకున్న తర్వాత క్షయ, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారే. వీరిలో 20 శాతం మందికి చికిత్స అందించడం ఇబ్బందిగా మారుతోంది. దీనికి కారణం వీరు పోస్ట్ కరోనా లక్షణాలను విస్మరించడమే. కొన్నిసార్లు ఈ లక్షణాలు ప్రాణాంతకం కావచ్చు. దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో 88 శాతం పోస్ట్ కవిడ్ లక్షణాలతో బాధపడుతుండొచ్చని గతేడాది లంగ్ ఇండియా జర్నల్ ప్రచురించిన ఓ అధ్యయనం తెలిపింది. ఈ లక్షణాలను విస్మరించిన 30 శాతం కేసులు తీవ్ర ప్రమాదంగా మారే ప్రమాదం ఉంది’ అని దీపక్ తల్వార్ హెచ్చరించారు.
కరోనాతో పోలిస్తే ఒమిక్రాన్ బారి నుంచి కోలుకున్న వారిలో ప్రమాదం ఎక్కువ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ నుంచి బయట పడిన వారు ఎక్కువగా రోగ నిరోధక శక్తి కోల్పోతున్నట్లు తెలిపారు. వీరు భవిష్యత్‌లో ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశముందని అన్నారు. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న వారు.. లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయని వేచి చూడకుండా వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేసుకోవాలని సూచించారు. కరోనా, ఒమిక్రాన్‌ల ప్రభావం.. కేవలం ఊపిరితిత్తుల పైనే కాకుండా.. వీటివల్ల రక్తం గడ్డకట్టడం, గుండె, మెదడు, కండరాల సమస్యలు, వాంతులు, అతిసారం, జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
అందుకే కరోనా నుంచి కోలుకున్నామని కుష్ అవ్వండి కానీ జాగ్రత్తగా ఉండమని వైద్యులు సూచిస్తున్నారు. ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. సరైన సమతుల్య ఆహారం తీసుకుంటూ.. రోజుకు అరగంట సేపు వ్యాయామం చేస్తే పోస్ట్ కొవిడ్ లక్షణాలను దీటుగా ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.