Begin typing your search above and press return to search.
వాళ్లుంటే 100 ఏళ్లైనా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా?
By: Tupaki Desk | 29 Aug 2020 8:30 AM GMT125 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. దేశవ్యాప్తంగా మొత్తం 543 ఎంపీ సీట్లలో కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. విచిత్రం ఏంటంటే.. మధ్యప్రదేశ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా దాదాపు సున్నా ఎంపీ సీట్లకు ఆ రాష్ట్రాల్లో పరిమితమైంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇంకా పాత రాజకీయాలే చేస్తోంది మరీ అని విశ్లేషకులు చెబుతున్నారు..
వృద్ధ జంబూకాలు, సుప్రీం కోర్టులో ఉన్న లాయర్లు, వాళ్లకు వాళ్లే మేధావులు అనుకునే గాంధీ కుటుంబం విధేయులు కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ వాళ్లకు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలతో సంబంధాలు ఉండవు. ఎందుకంటే... వాళ్లు సోనియా గాంధీ చుట్టూ తిరిగుతూ ఆమెను బయట ప్రపంచానికి రానీయకుండా ఆమెకు రోజు ఏదో పొగిడే సామెతలు చెప్తూ వాళ్ల పబ్బం గడుపుకుంటున్నారన్న ప్రచారం ఉంది. అంతా మేమే అని చెప్తూ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులకు.. గాంధీ కుటుంబం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా చేస్తున్నారు.
క్షేత్రస్థాయి కాంగ్రెస్ నేత బాధలు చెప్పుకోవాలంటే ఈ చిదంబరంకో.. కపిల్ సిబాల్ తోపాటు ఇలాంటి వృద్ధ నేతలకు వంగివంగి దండాలు పెట్టాల్సి ఉంటుందట.. అది సోనియా గాంధీ వరకు పోదు. ప్రజలకు గాంధీ కుటుంబంకు మధ్య గ్యాప్ ఉన్నంతవరకు కాంగ్రెస్ అధికారంలోకి రాదనే చర్చ ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది. కాబట్టి వాస్తవాలు గుర్తించకపోతే 100 సంవత్సరాలైనా కాంగ్రెస్ అధికారంలోకి రాదు అని మేధావులు అంటున్నారు.