Begin typing your search above and press return to search.
టీడీపీ చెట్టెక్కి కూర్చుంటే... వారి సంగతేంటి...?
By: Tupaki Desk | 25 March 2022 10:17 AM GMTతెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ పార్టీకి ఎత్తులు నేర్పడం అంటే తాతకు దగ్గులు నేర్పడమే. అందుకే టీడీపీ ఇపుడిపుడే సరికొత్త అస్త్రాలను బయటకు తీస్తోంది. ఇపుడు టీడీపీ ముందు రెండు రకాల విషయాలు ఉన్నాయి. ఒకటి విపక్షాన్ని ఐక్యంగా చేయడం. అంటే వారితో తాను కలవడం కాదు, వారిని తన దారికి తెచ్చుకోవడం. రెండవది అధికార వైసీపీని కట్టడి చేయడం. వైసీపీని నిలువరించే పనిలో టీడీపీ బాగానే సక్సెస్ అవుతోంది. ఇపుడు విపక్షాల విషయంలో కూడా కొత్త ఎత్తులు వేస్తోంది.
విపక్షాల ఓట్లు ఏ ఒక్కటీ చీలకుండా ఉండాలన్నదే టీడీపీ ఆలోచన కూడా. అయితే ఇది అచ్చంగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో చెప్పినట్లుగానే ఉంటుంది. కానీ ఇక్కడ పెద్దన మాత్రం కచ్చితంగా టీడీపీనే. అదే విధంగా విపక్షాలు మరీ డిమాండ్లు చేయకుండా తాము కోరుకున్నట్లుగా వారిని ఉంచడం. ముఖ్యంగా సీట్ల బీరాల విషయంలో అయితే తాను అనుకున్న విధంగా చేయాలనుకోవడం.
టీడీపీ ఇపుడు ఈ ఎత్తుగడలలో ఫుల్ బిజీగా ఉంది. అందుకే ఇపుడు తమ్ముళ్ళ నోటి ద్వారా మరో సౌండ్ వినిపిస్తోంది. పొత్తులు వద్దు ఏమీ వద్దు, మొత్తం సీట్లకు మనమే పోటీ చేద్దామని, నిజానికి చంద్రబాబు 2019 ఎన్నికలో మాత్రమే ఆ ప్రయోగం చేశారు. దాని రిజల్ట్ కూడా చూశారు. ఈసారి ఆయన అలా చేస్తారు అని ఎవరూ అనుకోవడం లేదు.
కానీ టీడీపీలో టోన్ మారుతోంది అన్న సంకేతాలు అయితే బయటకు వెళ్తున్నాయి. ఏపీలో బాహుబలి లాంటి టీడీపీకి పొత్తుల అవసరం లేదు అన్నదే దాని సారాంశం. మరి చంద్రబాబు అనుమతి లేకుండా ఆయన మనసులో ఏదీ లేకుండా ఇలాంటి డిమాండ్లు పుట్టుకువస్తాయా అన్నదే చర్చ. అంటే దీని అర్ధం పొత్తులు మా కంటే మీకే చాలా ఎక్కువ అవసరం అని విపక్షాలకు ఈ విధంగా చెప్పడం అన్న మాట.
ఇప్పటికే జనసేన టీడీపీ సహా ఇతర పక్షాలను తగ్గమంటోంది. తమకు కోరుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో పవన్ సీఎం కావాలన్న అజెండాను వారు బయటకు తీస్తున్నారు. దానికి రివర్స్ అన్నట్లుగానే పొత్తులు వద్దు అన్న స్లోగన్ కొత్తగా టీడీపీ నుంచి వస్తోంది అని అంటున్నారు.
ఇలా చేయడం వెనక టీడీపీ ధీమా ఏంటి అంటే ఈసారి టీడీపీ విపక్షంలో ఉంది. అధికార పార్టీ పట్ల వచ్చే వ్యతిరేకత ఏది ఉన్నా అది కచ్చితంగా టీడీపీ వైపే ఓట్లుగా టర్న్ అవుతుంది. దాదాపుగా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్న టీడీపీ ఏపీలో బలమైన పార్టీ.పైగా ఇపుడు నేతలు అంతా రీచార్జి అయ్యారు. దాంతో పొత్తులు లేకపోయినా నెగ్గగలమని చెబుతున్నారు. దాంతో కలసివస్తే కచ్చితంగా విపక్షాలతో వెళ్లాలి. లేకపోతే తామే సొంతంగా బరిలోకి దిగాలన్న స్ట్రాటజీని టీడీపీ అమలు చేస్తోంది అంటున్నారు.
దీని వల్ల నష్టం ఎవరికీ అంటే జనసేన, బీజేపీ వంటి వాటికే అంటున్నారు. జనసేన బీజేపీ కూటమి పోటీలో ఉంటే ఓట్లు ఎంతో కొంత చీలుతాయి. అదే టైంలో జనసేనకు కొన్ని స్థానాలు దక్కినా అవి కూడా పెద్ద నంబర్ గా ఉండేవి కావు. ఇక బీజేపీని కూడా జనసేన గెలిపించాల్సి ఉండవచ్చు.
ఇక జగన్ మీద యాంటీ బాగా పెరిగితే చంద్రబాబునే సీఎం గా చేసుకోవాలని జనాలు చూస్తారు. అపుడు ఇతర పక్షాలు పోటీలో ఉన్నా పెద్దగా ఓట్లు చీలే ప్రసక్తి ఉండదని టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే టీడీపీ ఒక విధంగా పొత్తుల మీద చెట్టెక్కి కూర్చోబోతోంది అని అంటున్నారు. దాంతో మిగిలిన పక్షాలు పొత్తుల కోసం టీడీపీ వెంటబడే సీన్ ని క్రియేట్ చేయాలనుకుంటోంది. మరి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయితే మాత్రం ఏపీలో టీడీపీయే పెద్దన్న అనడంతో సందేహమే లేదు.