Begin typing your search above and press return to search.

భర్తను చంపినా ఆ భార్యకు పింఛన్ ఇవ్వాల్సిందే: హైకోర్టు

By:  Tupaki Desk   |   31 Jan 2021 1:46 PM GMT
భర్తను చంపినా ఆ భార్యకు పింఛన్ ఇవ్వాల్సిందే: హైకోర్టు
X
సాధారణంగా గవర్నమెంట్ లెక్కల ప్రకారం.. బతికి ఉన్నన్నీ నాళ్లు ప్రభుత్వ ఉద్యోగికి పింఛన్ వస్తుంది. ఆయన చనిపోతే భార్యకు ఇస్తారు. వారిద్దరూ పోతూ రద్దు చేస్తారు. ఇది జరిగే తంతు. అయితే ఇక్కడ భార్యనే తన భర్తను చంపిందని తేలితే పెన్షన్ ఇస్తారా. ? ఇలాంటి డౌట్ ఎవ్వరికి రాలేదు. కానీ తాజాగా హర్యానా హైకోర్టు ఈ విషయంలో సంచలన తీర్పును ఇచ్చింది.

పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టు మాత్రం ప్రభుత్వాన్ని తప్పు పడుతూ పింఛన్ ఇవ్వమని ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ ఆపేసిన హర్యానా ప్రభుత్వం ఆదేశాలను కొట్టేసింది. తన భర్తను భార్యే చంపిందని తెలిసినా ఫ్యామిలీ పెన్షన్ ఆమెకు ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేయడం విశేషం.

ఓ ప్రభుత్వ ఉద్యోగి అకారణంగా చనిపోతే అతడి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వడానికి ఫ్యామిలీ పింఛన్ అనే వెల్ఫేర్ స్కీమ్ ను తీసుకొచ్చారు. భర్త మరణం తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా కూడా ఆమె పెన్షన్ పొందడానికి అర్హురాలే. అందువల్ల భార్య ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలినా ఫ్యామిలీ పింఛన్ ఇవ్వాల్సిందేనని కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.

బల్జీత్ కౌర్ అనే మహిళ తన భర్త అయిన ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసింది. 2008లో ఇది జరిగింది. 2009లో పోలీసులు హత్యానేరం మోపి జైలుకు పంపారు. 2011లో ఆమె దోషిగా తేలింది. ఆ తర్వాత హర్యానా ప్రభుత్వం ఆమెకు పింఛన్ నిలిపివేసింది.

దీనిపై మహిళ హైకోర్టులో పిటీషన్ వేయగా.. విచారణలో హర్యానా ప్రభుత్వ ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. సంబంధిత శాఖకు పూర్తి బకాయిలతో ఇక నుంచి పింఛన్ చెల్లించాలని ఆదేశించింది.